ధన త్రయోదశికి ముందే శక్తివంతమైన గజకేసరి రాజయోగం.. వీరు పట్టిందల్లా బంగారం!
హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ధన త్రయోదశిని అక్టోబర్ 18వ తేదీన జరుపుకుంటారు. అయితే ఈసారి ధన త్రయోదశి కంటే ముందే అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. చంద్రుడు, బృహస్పతి కలయిక ద్వారా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.
గజకేసరి రాజయోగం.. వీరిదే అదృష్టం
అక్టోబర్ 12వ తేదీన చంద్రుడు బృహస్పతి ఇప్పటికే ఉన్న మిధున రాశిలోకి ప్రవేశించి గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ కారణంగా కొన్ని రాశులకు స్వర్ణయుగం రాబోతుంది. వీరికి ఆకస్మిక ధన లాభాలు, అన్ని విధాల పురోగతి సాధ్యమవుతుంది. ఈ గజకేసరి రాజయోగం తో అదృష్టవంతులు అయ్యే రాశులను గురించి తెలుసుకుందాం.

కన్యారాశి
గజకేసరి రాజయోగం కన్యారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. వృత్తి, వ్యాపారపరంగా ఈ సమయం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాజయోగం కన్యరాశిలో కర్మ గృహంలో ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఈ సమయంలో ఏ వ్యాపారం చేసినా మంచి విజయాలను సాధిస్తారు. నూతన వాహనాలను, ఇళ్లను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది వ్యాపారవేత్తలకు బిజినెస్ వస్తుంది. గణనీయమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. తండ్రితో మీ సంబంధం బాగుంటుంది.
మిధున రాశి
గజకేసరి రాజ యోగం మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇది మిధున రాశిలో లగ్న గృహంలో జరుగుతుంది. అందువల్ల వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వివాహితులకు సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది. ఇల్లు, కార్లు కొనాలని ఆశించేవారు విజయం సాధిస్తారు.. ఈ సమయం మిధున రాశి వారికి బాగుంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాజయోగం వృషభ రాశిలో రెండవ ఇంట్లో ఏర్పడుతుంది. దీనివల్ల మీకు కమ్యూనికేషన్లో మెరుగుదల కనిపిస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మార్కెటింగ్, మీడియా, బ్యాంకింగ్, గణితం లేదా స్టాక్ మార్కెట్ కు సంబంధించిన రంగాలలో ఉన్నవారు లాభాలు చూస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు ఆర్థిక లాభాలను అనుభవిస్తారు. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications