కార్తీక పౌర్ణమి నాడే గజకేసరి రాజయోగం.. నక్కతోక తొక్కిన రాశులవారు వీరే!

నవంబర్ నెలలో గ్రహాల చలనం కారణంగా అద్భుతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. నవంబర్ మాసంలో అత్యంత పవిత్రమైన కార్తీకమాసంలో ముఖ్య గ్రహాల కదలిక వాటి సంయోగం అనేక విశేష యోగాలను కలిగిస్తున్నాయి. నవంబర్ మాసంలో 15 ,16, 17 తేదీలలో వృషభ రాశిలో గురు చంద్రుల యుతి జరగబోతోంది. దీంతో మూడు రోజుల కాలంలో కొన్ని రాశుల వారి జీవితాల పై కనక వర్షం కురుస్తుంది. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

మేషరాశి
గజకేసరి రాజయోగం కారణంగా మేష రాశి వారికి ఆదాయపరంగా కలిసి వస్తుంది. ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో చేసే ఏ ఆదాయ ప్రయత్నం అయినా ఫలిస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

gajakesari rajyoga on Kartika Pournami these zodiac signs will get huge wealth and happiness

వృషభరాశి
గజకేసరి రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. సంతానయోగం కలుగుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు. ఈ సమయంలో ఆదాయానికి లోటు ఉండదు.

కర్కాటక రాశి
కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కారణంగా కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. శత్రువుల మీద విజయాలు సాధిస్తారు. ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి.

కన్యారాశి
కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కన్యారాశి జాతకులకు కలిసొస్తుంది. కన్యారాశి వారి భాగ్యస్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడడం వల్ల వీరి కెరీర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగం మారడానికి కూడా ఇది మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఈ మూడు రోజులు ఏ నిర్ణయాలు తీసుకున్న తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి.

వృశ్చిక రాశి
గజకేసరి రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం కలిసొస్తుంది. ఉద్యోగంలో వేతనాల పెంపు జరుగుతుంది. ప్రమోషన్లు వస్తాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో బాంధవ్యాలను పెంచుకుంటారు.

మకర రాశి
కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మకర రాశి జాతకులు ఉద్యోగ ప్రయత్నాలలో ఘనవిజయాలను సాధిస్తారు. శత్రు వర్గం నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ పని చేసినా సఫలం అవుతుంది. ముఖ్యంగా గృహ వాహనయోగాలు ఉన్నాయి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+