12ఏళ్ళ త్వరాత గురు-శుక్ర సంయోగంతో గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులవారికి సంపద వర్షం!!
12 సంవత్సరాల తర్వాత గురు శుక్రుల కలయికతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. బృహస్పతి మరియు శుక్రుడు ఒకరి కేంద్ర గృహంలో, ముఖాముఖిగా లేదా మొదటి, నాల్గవ, లేదా ఏడవ గృహాలలో ఉన్నప్పుడు గజలక్ష్మి రాజయోగాన్ని సృష్టిస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం గజలక్ష్మీ రాజయోగం అత్యంత అదృష్టాన్ని ఇచ్చే యోగం. వృషభరాశిలో ఏర్పడిన గజలక్ష్మి రాజయోగం కారణంగా వివిధ రాశుల వారికి శుభాలు చేకూరుతాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా మేష రాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో చేసే పనులలో పురోగతిని సాధిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం రెండూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.

కర్కాటక రాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు మంచి రాబడి ఉంటుంది. ఈ సమయంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవం దక్కుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా ఇప్పుడు లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బకాయిలు కూడా వసూలవుతాయి. ఈ సమయంలో మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కన్యారాశి
కన్యారాశి జాతకులకు గజలక్ష్మి రాజయోగం ఎంతో మేలు చేస్తుంది. ఈ రాజయోగం మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో ఉద్యోగాలు మారడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. డబ్బు విషయంలో మీరు పొదుపు చేయడానికి ఇదే సరైన సమయం. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీకు ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి లబ్ది జరుగుతుంది. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. కెరీర్ లోను అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఆరోగ్య పరంగాను మంచి ఫలితాలనే పొందుతారు. ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల అండ పూర్తిగా లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారు ఆ వ్యాపారాలలో విజయాలను సాధిస్తారు.
మీనరాశి
మీనరాశి జాతకులు గజలక్ష్మి రాజయోగం కారణంగా సత్ఫలితాలను పొందుతారు. పనిలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. మీకు ఇది లాభదాయకంగా ఉండే సమయం. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications