2025లో వీరింట సిరిసంపదల వర్షం ప్రకటించిన గజలక్ష్మీ రాజయోగం!

జ్యోతిష్య శాస్త్రంలో గురువుకు, శుక్రునికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బృహస్పతి మరియు శుక్రుడి కలయిక అరుదైన ఖగోళ సంఘటనను ఏర్పరుస్తుంది. 2025 సంవత్సరంలోని జులై నెలలో బృహస్పతి శుక్రుడి సంయోగం అత్యంత శక్తివంతమైన గజలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది . 12 ఏళ్ల తర్వాత 2025 జూలైలో మిధున రాశిలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది.

జులై 26వ తేదీన గజలక్ష్మీ రాజయోగం
జూలైలో శుక్రుడు బృహస్పతిని అనుసరిస్తూ మిధునరాశిలోకి వస్తాడు. జులై 26వ తేదీన బృహస్పతి ఉన్న మిధున రాశిలోకి శుక్రుడు సంచరించడం కారణంగా బృహస్పతి శుక్రుల సంయోగం వల్ల ఏర్పడే గజలక్ష్మి రాజయోగంతో కొన్ని రాశుల వారికి సంపద శ్రేయస్సు లభిస్తుంది. ఇది ఆర్థిక విజయాలకు కారణమవుతుంది .

Gajalakshmi rajyoga with Jupiter-Venus conjunction in 2025 will give huge money to these zodiac signs

గజలక్ష్మీ రాజయోగంతో ఈ రాశులవారు లక్కీ
2025 సంవత్సరంలో గజలక్ష్మి రాజయోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం వరిస్తుంటే మిగతా రాశుల వారు కూడా సానుకూల ప్రయోజనాలనే పొందుతారు. వృద్ధి వాతావరణాన్ని చూస్తారు. ఇక 2025లో సూపర్ లక్కీ అవుతున్న ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి గజలక్ష్మి రాజయోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఆర్థిక అభివృద్ధిని చూస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో మంచి ప్రయోజనాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఉద్యోగాలు చేసేవారు ఆర్థిక పురోగతిని సాధిస్తారు.

సింహరాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా సింహ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. సింహరాశి జాతకులకు ఈ సమయం ఆర్థికంగా లబ్ధిని చేకూరుస్తుంది. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. గృహాలు, వాహనాలు, భూములు వంటి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు.

తులారాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా తులారాశి జాతకులు ప్రయోజనాలను పొందనున్నారు. ఈ సమయం తులా రాశి జాతకులకు మంచి ప్రయోజనాలను ఇస్తుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. సృజనాత్మక కార్యకలాపాలు విజయాలను తెచ్చిపెడతాయి. ఇది తులా రాశి జాతకులకు మంచి గుర్తింపుని తెచ్చే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+