గజలక్ష్మీ యోగం.. సరిగ్గా ఐదు రోజుల్లో వీరికి డబ్బే డబ్బు
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా వివిధ యోగాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఏప్రిల్ 25 గురువారం మధ్యాహ్నం మేషరాశిలో సంచరించబోతున్నాడు. అప్పటికే అక్కడ దేవగురువు బృహస్పతి సంచారం కొనసాగుతుంది. శుక్రుడు బృహస్పతి కలయిక గజలక్ష్మీ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది.
ఆరు రోజుల అదృష్టం
ఈ యోగం వల్ల సంపదలను పొందే బలమైన అవకాశాలు కలుగుతాయి. అయితే దేవగురువు అయిన బృహస్పతి మే ఒకటవ తేదీ వరకు మేషరాశి లోనే ఉండడంవల్ల ఆరు రోజులపాటు గజలక్ష్మి యోగం ఉంటుంది. గజలక్ష్మి యోగం వల్ల లబ్ధిని పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల శుభం కలుగుతుంది. వీరి ఆదాయం పెరిగి సుఖసంతోషాలతో జీవిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే ఉంటుంది. మేషరాశి జాతకులు విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధిస్తారు. చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీ రంగంలో విజయాలు సాధిస్తారు. ఒక పెద్ద అవకాశం మీ జీవితాన్ని మార్చేస్తుంది.
మిధునరాశి
మిధున రాశి జాతకులకు గజలక్ష్మి యోగం లాభిస్తుంది. మీరు చేసే పనులలో సానుకూల ఫలితాలను పొందుతారు. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి. అన్ని విధాలుగా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది.
సింహరాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా సింహరాశి వారికి మేలు జరుగుతుంది. సింహరాశి జాతకులు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆర్ధిక పరిస్థితి బలోపేతం అవుతుంది. బంధాలు మంచిగా ఉంటాయి. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.
తులారాశి
గజలక్ష్మి యోగం కారణంగా తులా రాశి జాతకులకు ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు అందుకుంటారు. ఈ సమయంలో వ్యాపారం చేసే వారికి లాభదాయకంగా కూడా ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన వివాదాలు తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీరు సంతోష పడే విషయాలను, వార్తలను ఈ సమయంలో వింటారు.
కన్యారాశి
కన్యారాశి జాతకులకు గజలక్ష్మి రాజయోగం అపార విజయాలను అందిస్తుంది. సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి. పరిష్కారం కాని సమస్యలు తొలగిపోతాయి. భాగస్వామితో మంచి సంబంధాలను ఏర్పరుచుకోవడం లో ఈ సమయంలో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
మకరరాశి
గజలక్ష్మీ యోగం కారణంగా మకరరాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఈ సమయంలో ధన ప్రవాహానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం. జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications