ఆగస్టు నుండి నాలుగు నెలలు.. వీరిపై సంపదల వర్షం కురిపించే లక్ష్మీదేవి!
గ్రహాల గమనం మానవ జీవితం పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఆగస్టు నెలలో ముఖ్య గ్రహాల గమనం కారణంగా అనేక రాశుల వారికి శుభాలు కలుగుతుండగా కొన్ని రాశుల వారికి అశుభాలు జరుగుతున్నాయి. ఆగస్టు నెలలో నవగ్రహాల పరిస్థితుల కారణంగా, ముఖ్యంగా శుక్ర గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలలో లక్ష్మీ కటాక్షం కొనసాగుతుంది.
ఈ ఏడాది ధనవంతులయ్యే రాశులవారు
అయితే ఆగస్టు నెల నుండి నాలుగు నెలల పాటు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రంగా నిలిచే ఆ రాశులవారు ఎవరు? ఈ ఏడాది లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉన్న ధనవంతులు అయ్యే అవకాశం ఉన్న రాశులవారు ఎవరు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ధనస్సు రాశి
ఆగస్టు నుంచి రాబోయే నాలుగు నెలల కాలంలో ధనుస్సురాశి జాతకులపైన లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ధనుస్సురాశిలో జరిగే గ్రహాల సంచారం కారణంగా అదృష్టం కలిసొస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ధనుస్సు రాశి వారి కుటుంబ వాతావరణం సంతోషదాయకంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం లాభిస్తుంది. గతంలో చేసుకున్న వ్యాపార ఒప్పందాలు కలిసొస్తాయి.
సింహరాశి
ఆగస్టు నుంచి నాలుగు నెలల పాటు లక్ష్మీదేవి ద్వారా అదృష్టాన్ని పొందే రాశులలో సింహరాశి ఒకటి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహరాశి జాతకులు ఈ సమయంలో వ్యాపారంలో బోలెడు లాభాలను పొందుతారు. వీరికి డబ్బు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో వీరు ఖర్చులను నియంత్రించాలి. సింహరాశి జాతకుల ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది. ఈ సమయంలో శుభవార్తలను వింటారు. ఈ రాశివారు ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమిస్తారు.
కర్కాటక రాశి
లక్ష్మీదేవి అనుగ్రహం ఆగస్టు నుంచి రాబోయే నాలుగు నెలలు కర్కాటక రాశి వారిపై బ్రహ్మాండంగా ఉంటుంది. వీరి కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి వారి చేతికి అందుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరు అనుకున్న పనులను సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. ఏడాది చివరి నాటికి కర్కాటక రాశి జాతకులకు వివాహాలు ఫిక్స్ అవుతాయి. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వీరికి ఇది మంచి సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications