జులై 15వరకు వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరన్న గురు ఆదిత్య యోగం!

గ్రహాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం జూలై మాసంలో కూడా గ్రహాల సంచారం జరుగుతుంది. ప్రస్తుతం జూలై మాసంలో సూర్యుడు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు. జూన్ 15వ తేదీన మిధున రాశిలో సంచారం ప్రారంభించిన సూర్యుడు జూలై 15వ తేదీ వరకు మిధున రాశి లోనే సంచరిస్తాడు.

గురు ఆదిత్య యోగం
ప్రస్తుతం బృహస్పతి కూడా మిధున రాశి లోనే సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగా మిధున రాశిలో బృహస్పతి మరియు సూర్యుల కలయిక జరుగుతుంది. ఈ కలయిక కారణంగా గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది. గురు ఆదిత్య యోగం సహజంగా శుభయోగం. ఈ శుభయోగం కారణంగా జూలై 15వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

guru aditya yoga will give luck to these zodiac signs till july 15th

వృషభరాశి
గురు ఆదిత్య యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ యోగం వీరికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. దీనివల్ల వ్యాపారవేత్తలకు కలిసి వస్తుంది. వివిధ ఒప్పందాల నుంచి భారీ ప్రయోజనాలను పొందుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. వీరి ఆరోగ్యం బాగుపడుతుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో తమ భాగస్వాములతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

సింహరాశి
గురుఆదిత్య యోగం కారణంగా సింహరాశి జాతకులు గొప్ప ప్రయోజనాలను పొందుతారు. సింహరాశి వారి ఆదాయ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. వివిధ వనరుల నుండి ఆదాయం వస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసివస్తుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. సింహరాశి వారికి కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. వివిధ పెట్టుబడుల నుండి డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి. సంపద స్థాయిలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే అవకాశం ఉంటుంది.

కన్యారాశి
గురు ఆదిత్య యోగం కారణంగా కన్యారాశి జాతకులకు ఇది శుభ సమయంగా మారుతుంది. వ్యాపారవేత్తలకు కలిసి వస్తుంది. లాభాలు వస్తాయి. వివిధ ఒప్పందాల నుండి ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ బాగుంటుంది. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. ఈ సమయంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. వివిధ పనులలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది అన్ని విధాలా కన్యా రాశి వారికి కలిసి వచ్చే కాలం.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+