Guru Purnima 2023: డబ్బు కష్టాలు, చదువులో ఇబ్బందులు ఈ పరిహారాలతో మాయం!!
గురుపూర్ణిమను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూలై 3వ తేదీన సోమవారం నాడు జరుపుకోనున్నారు. ఈ ఏడాది గురు పౌర్ణమి నాడు బ్రహ్మ యోగం, ఇంద్ర యోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ గురుపూర్ణిమ చాలా ప్రత్యేకం అని చెబుతున్నారు.
కొందరి జాతకంలో గురు దోషం ఉంటుంది.అయితే గురు పౌర్ణమి నాడు కొన్ని ప్రత్యేక మైన చర్యలు చేయడం వల్ల జాతకంలో గురు దోషం ఉంటే తొలగిపోతుందని చెబుతున్నారు గురు పౌర్ణమి నాడు చేయవలసిన ఆ ప్రత్యేక చర్యలు ఏంటో ప్రస్తుతం తెలుసుకుందాం. గురు పౌర్ణమి గురు దోషం నుండి బయట పడడానికి, బృహస్పతిని బలోపేతం చేయడానికి, ప్రత్యేకమైన రోజుగా చెప్పొచ్చు.

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వారు గురు పౌర్ణమి రోజు విష్ణు అవతారమైన సత్యనారాయణుని కథలు చదవడం వల్ల ఇంట్లో ఆనందం వస్తుంది. అంతేకాదు అదృష్టం కూడా కలిసి వస్తుంది. చదువులో ఆటంకాలు ఎదురవుతున్న వారు గురు పౌర్ణమి నాడు పసుపు దండతో ఓం హ్రీ హ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అని మంత్రాన్ని జపిస్తే గురువు దుష్ప్రభావాల కారణంగా కలిగే ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు.
జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నవారు సంతానలేమితో బాధ పడతారు. అలా సంతానలేమితో బాధపడే వారు గురు పౌర్ణమి నాడు కుంకుమ, పసుపు, చందనం కలిపి విష్ణుమూర్తికి సమర్పిస్తే ,గురు పౌర్ణమి నాడు అవసరమైనవారికి బెల్లాన్ని దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. ఈ చర్య వల్ల బృహస్పతి బలంగా మారతారని చెబుతున్నారు.
ఇక వ్యాపారంలో పురోగతి కోసం గురుపౌర్ణమినాడు పసుపు రంగు దుస్తులు, పసుపు రంగు పండ్లు, స్వీట్ లు, కుంకుమ పువ్వు, నెయ్యి, ఇత్తడి సామాను దానం చేయాలని చెబుతున్నారు. అప్పుడు వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈశాన్య దిక్కు గురు గ్రహానికి సంబంధించింది కావడంతో, గురు పౌర్ణమి రోజున ఈశాన్య దిక్కును శుభ్రపరిచి నెయ్యి దీపాన్ని వెలిగిస్తే కూడా వ్యాపారంలో పురోగతి సాధ్యమవుతుందని అంటున్నారు.
సంతానలేమి, చదువులో ఆటంకాలు, ఆర్థిక సంక్షోభాలు, వృత్తి వ్యాపారాలలో చిరాకులు ఉంటే గురుపూర్ణిమ రోజు ఈ పరిహారాలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈ పరిహారాలతో గురు దోషం తొలగిపోయి జీవితంలో శ్రేయస్సు, ఆనందం వెల్లివిరుస్తాయని అంటున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications