రేపే హనుమజ్జయంతి.. అతి పవిత్రమైన వేళలివే
చైత్రమాసంలో వచ్చే పౌర్ణమిని హనుమజ్జయంతిగా జరుపుకుంటాం. శ్రీరాముడి భక్రాగ్రేసరుడైనా హనుమంతుడిని వానర దేవుడిగా కీర్తిస్తారు. ఈరోజు ఎక్కువమంది ఉపవాసం ఉండి ఆంజనేయుడి ఆలయాలను సందర్శిస్తారు. ఆరోజు సుందరకాండ ను పారాయణం చేస్తారు. భజరంగబలి జయంతి, హనుమాన్ జయంతి.. ఇలా పేరేదైనా పండగ మాత్రం ఒక్కటే. ఏప్రిల్ 6వ తేదీ గురువారం రోజు హనుమాన్ జయంతికి పూజావేళలు ఉన్నాయి. పౌర్ణమి తిథి 5వ తేదీన ఉదయం 9.19 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10.04 గంటలకు ముగస్తుంది. కొంత సమయం చాలా పవిత్రమైందిగా భావిస్తారు.
పవిత్రమైన సమయ వేళలు
ఉదయం 6:06 గంటల నుంచి డి 7:40 గంటల వరకు
ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు
మధ్యాహ్నం 12:23 నుంచి 1:58 వరకు
మధ్యాహ్నం 1:58 నుంచి 3:32 వరకు
సాయంత్రం 5:07 నుంచి 6:41 వరకు
సాయంత్రం 6:41 నుంచి రాత్రి 8:07 వరకు

హనుమంతుడు వానర రాజు కేసరి, తల్లి అంజనీదేవికి జన్మించినట్లు పండితులు చెబుతారు. హనుమంతుడిని పరమేశ్వరుడి అవతారంగా కీర్తిస్తారు. శ్రీరాముడికి సేవ చేసేందుకే శివుడు హనుమంతుడి అవతారంలో జన్మించాడని, హనుమంతుడికి భజరంగబలి, పవన పుత్ర, అంజనీ నందన్, సుందర్, మారుతి నందన్, సంకట్ మోచన్ అనే పేర్లున్నాయి. కష్టాలు, ఇబ్బందులు తొలగిస్తాడు కాబట్టి సంకటమోచనుడయ్యాడు. ఉత్తర భారతదేశంలో ఈ పర్వదినాన్ని విశేషంగా నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications