సూర్యుడి సంచారంతో 2023లో ఈ రాశుల వారికి ఆరోగ్యం, ఆనందం!!
గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు సంచారంతో వివిధ రాశుల వారి జాతకంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏప్రిల్ నెల నుండి, ఈ సంవత్సరం అంతా వివిధ రాశులలో సూర్యుడు ఏ కాలంలో సంచరిస్తాడు? సూర్య సంచారం వల్ల ఆయా రాశి జాతకుల జీవితాలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? వంటి వివరాలను ప్రస్తుత మనం తెలుసుకుందాం.
రాశులలో సూర్య సంచారం.. తెస్తుంది శుభం: సూర్యుడు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే దేవుడు. సూర్యుడు ఏ రాశిలో అయితే మంచి స్థానంలో ఉంటాడో ఆయా రాశి జాతకుల జీవితాలు ఆనందంగా ఉంటాయి. ఏప్రిల్ నెల నుండి వివిధ రాశులలో సూర్యుడు సంచారం ఆయా రాశుల వారికి డబ్బు, వృత్తి, ఆరోగ్య పరంగా శుభాలను చేకూరుస్తుంది. మేషరాశి, కర్కాటక రాశి, మిధున రాశుల జాతకుల జీవితాలపై సూర్యుడు ప్రభావం కనిపిస్తుంది.

మేషరాశి : గ్రహాల పాలకుడైన సూర్యుడు మేషరాశిలో సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలలో లభిస్తుంది. ఉద్యోగ జీవితంలోనూ వారు ముందుకు దూసుకుపోగలుగుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఈ సమయం వ్యాపారులకు కూడా ఎంతో ఫలవంతంగాను, ఆర్థికంగా లాభదాయకంగానే ఉంటుంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు మేషరాశి జాతకులను సూర్యుడు అనుగ్రహిస్తాడు.
కర్కాటక రాశి : కర్కాటక రాశిలో జూన్ 22 నుండి జూలై 22 వరకు సూర్యుడు సంచరిస్తాడు. కర్కాటక రాశిలో సూర్యుడు సంచారం వల్ల ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కార్యాలయాలలో సహ ఉద్యోగులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు. పదోన్నతి పొందే అవకాశం కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. అంతేకాదు సూర్యుడు సంచారం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
మిథున రాశి : మిధున రాశి జాతకులకు మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు సూర్యుడి సంచారం వల్ల కెరీర్ మంచిగా ఉంటుంది. కొత్త మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. చేసిన పనిలో కూడా మన్ననలు పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. అంతేకాదు ఆర్థిక లాభాలకు కూడా బలమైన అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణులు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications