భారీ వర్షాలను తీసుకు వచ్చే హస్తకార్తి: తెలుగు రాష్ట్రాలు జలమయమయ్యే ఛాన్స్!
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
తేది 27-సెప్టెంబర్-2018 నుండి మొదలుకుని 10-అక్టోబర్-2018 వరకు హస్తకార్తి ఉంటుంది. ఈ కార్తిలో పంచాంగరిత్య పూర్ణజలం సూచింపబడుతుంది. ఈ కార్తెకు వాహనం బర్రే కావున వర్షాలు కుండపోతగా కురియును. వాతవరణలో అల్పద్రోణి ప్రభావం చేత తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతలలో విపరీతమైన వడగల్లవానలు సమృద్దిగా వర్షాలచేత కొన్ని ప్రాంతలలో వరదలు వచ్చును. నదులు పోటేత్తుతాయి.
కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఎక్కువగా సూచనలు కనబడుతున్నాయి. కావునా లోతట్టు ప్రాంత్రాలవారు నదీ, సముద్రతీర ప్రాంతలవారు వరదనీటి ఉద్రిక్తతకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవలసిందిగా శాస్త్ర సూచనలు తెలియజేయడమైనది.

నదులు పొంగి పొర్లుతాయి, పాత కట్టడాలు, విధ్యుత్తుతీగలతో, మట్టి గృహాలతో, పశువుల పాకలు మొదలగు వాటితో జాగ్రత్తలు వహించాలి. ఈ కార్తె మొదలుకుని డిసెంబర్ వరకు వాతవరణంలో అనేక మార్పులు బీభత్సవమైన వర్షాలు, వరదలు, తుఫాన్లు, ఉపద్రవములు ఆంధ్రా, అస్సాం, ఒరిస్సా ప్రాంతలపై కొంత ఎక్కువ వరద ప్రభావం సూచింపబడుతుంది.
మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు. గ్రహ గోచారీత్య పంచాగ ఫల వివారాలు తెలుసుకుని రైతులు మరియు లోతట్టు ప్రాంతల వారు ముందస్తు జాగ్రత్తతో ఉండాలనే భావనచేత తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలం శాస్త్రంపై నమ్మకం ఉన్నవారికి మాత్రమే అని గ్రహించండి. శాస్త్రం అనేది సూచనలు చేస్తుంది కాని భయపెట్టదు. మీ మీ జాతకరీత్య గోచార గ్రహ ప్రభావ ఫలితంగా శుభాశుభ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.












Click it and Unblock the Notifications