సెప్టెంబరు 5వ తేదీలోపు ఈ రాశులవారికి అద్భుత ధనయోగం
గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు ఈరోజు తన నక్షత్ర ప్రవేశాన్ని మార్చాడు. మృగశిరలోకి ప్రవేశించిన అంగారకుడు వచ్చేనెల ఐదోతేదీ వరకు అక్కడే ఉంటాడు. అలాగే ఇదే నెలలో తన రాశిని కూడా మార్చబోతున్నాడు. వృషభరాశి నుంచి మిథునంలోకి ప్రవేశించే అంగారకుడి సంచారంవల్ల కొన్ని రాశులకు ఆర్థిక లాభాలున్నాయి. కుజుడి నక్షత్ర మార్పువల్ల ఏయే రాశులకు వచ్చే నెల ఐదోతేదీ వరకు ఏవిధంగా కలిసిరాబోతుందో తెలుసుకుందాం.
వృషభ రాశి
ప్రస్తుతం అంగారకుడు ఈ రాశిలోని సంచారం చేస్తున్నాడు. దీనివల్ల వీరికి ప్రత్యేకమైన ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడి ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఉద్యోగస్తులకు మంచి పురోగతి ఉంది. అదృష్టం తోడుండటంవల్ల అన్నిరకాలుగా కలిసివస్తుంది.

వృశ్చిక రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. ఉద్యోగం చేస్తున్న చోట ఊహించనిరీతిలో కొత్తగా పెద్ద బాధ్యతలను తీసుకునే అవకాశం కనపడుతోంది. ఈ సమయంలోనే మీరు కనే కలలను నెరవేర్చుకుంటారు. కొత్త ప్రాజెక్టులకు ఉద్యోగస్తులకు నాయకత్వం వహించడంతోపాటు అదనపు ఆదాయం ఇతర మార్గాల నుంచి వస్తుంది.
కుంభ రాశి
వీరు ఎంత శ్రమపడితే అంత ఫలితం దక్కుతుంది. కష్టానికి తగ్గ ఫలితాలు ఎప్పుడూ పొందుతారు. వ్యాపారస్తులకు మంచి విజయాలున్నాయి. వృత్తిలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంది. ఈ సమయంలో వీరు ప్రారంభించే కొత్త పనులు కలిసివస్తాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం అందుకుంటారు.
మిథున రాశి
అదృష్టం ప్రతి పనిలో తోడుండటంవల్ల ఏ పని తలపెట్టినా విజయం అందుకుంటారు. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. అందుకు పెద్దల నుంచి సలహాలు తీసుకొని ఆచరిస్తారు. అంగారకుడు ఆశీర్వదించడంవల్ల ప్రతి పనిలో మీకు మద్దతు దొరుకుతుంది. కొందరు దూర ప్రయాణాలు చేస్తారు. దీనివల్ల ఆర్థికంగా లాభాలే ఉన్నాయి.












Click it and Unblock the Notifications