Holi 2024: హోలికా దహనంలో ఈ వస్తువులను సమర్పిస్తే.. దరిద్రం పోతుంది; సంపద వస్తుంది!!
దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ. ఈసారి హోలీ పండుగ మార్చి 25వ తేదీన వస్తుంది. ఇక హోలీ పండుగ అద్భుతమైన శుభాలను కూడా ఈసారి మోసుకువస్తుంది. 2024 సంవత్సరంలో వస్తున్న హోలీ పండుగ అనేక అద్భుతమైన యాదృచ్ఛికమైన సంఘటనలను తీసుకువస్తుంది. చంద్రగ్రహణంతో పాటు అనేక శుభయోగాలకు హోలీ వేదిక అవుతుంది.
సనాతన ధర్మంలో హోలీ పండుగకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశవ్యాప్తంగా రంగుల పండుగను చాలా ఘనంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటారు . ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. హోలీ పండుగకు ముందు ఉత్తర భారత దేశంలో హోలికా దహనాన్ని నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కామ దహనం పేరుతో దానిని నిర్వహిస్తారు.

అయితే కామ దహనం మార్చి 24వ తేదీన రాత్రి 11: 13 నిమిషాల నుండి 12 :07 నిమిషాల వరకు నిర్వహించాలని ముహూర్తంగా నిర్ణయించారు.ఇక మరుసటి రోజు 25వ తేదీన పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. అయితే హోలీ పండుగకు ముందు రోజు జరిగే హోలికా దహనానికి చాలా విశిష్టత ఉంది. తెలుగువారు కామదహనంగా చెప్పుకునే ఈ కార్యక్రమంలో కలపను, ఆవు పేడతో చేసిన పిడకలను ఉపయోగించి అగ్నిదేవుడికి పూజలు చేస్తారు.
ఈ సమయంలో అగ్నికి ఆహుతి చేయడానికి కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించినట్లయితే మన జీవితంలో ఉన్న దరిద్రం తొలగిపోతుందని చెబుతున్నారు. హోలికా దహనం అగ్నిలో ఎండుకొబ్బరిని, తమలపాకులను, వక్కలను సమర్పించినట్లయితే డబ్బుకు కొరత ఉండదని చెబుతున్నారు. ఈ పరిహారం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు.
కామ దహనం లో బార్లీ గింజలను, బార్లీ పిండిని నైవేద్యంగా పెడితే ఇంట్లో గొడవలు, చిరాకులు తొలగిపోయి కుటుంబం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు. నెయ్యిలో నానబెట్టిన తమలపాకును నైవేద్యంగా పెట్టటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. మంటల్లో కర్పూరాన్ని సమర్పించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వతంగా ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు.
అక్షింతలను అగ్నికి సమర్పించడం వల్ల, లక్ష్మీదేవి సంతోషిస్తుందని, సంపదను ఇస్తుందని, దరిద్రం శాశ్వతంగా పోతుందని చెబుతున్నారు. కాబట్టి హోలీ పండుగకు ముందు నిర్వహించే కామదహనం మంటల్లో ఈ వస్తువులను వేసి దరిద్రాన్ని వదిలించుకోండి .సిరిసంపదలతో సంతోషంగా జీవించండి.












Click it and Unblock the Notifications