చంద్రగ్రహణంతో హోలీ 2024: రాశులవారీగా ఈ అదృష్ట రంగులతోనే జరుపుకోండి!!

హిందువులు పవిత్రంగా జరుపుకునే హోలీ పండుగ ఈ సంవత్సరం మార్చి 24వ తేదీన వస్తుంది. ఇక అదే రోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతున్న కారణంగా హోలీ ఆడే క్రమంలో కొన్ని రాశుల వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, వారు ఉపయోగించాల్సిన రంగులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

హోలీ పండుగ రోజు వివిధ రాశుల వారికి శ్రేయస్సును కలిగించే రంగులను ఉపయోగించడం వల్ల, మీ జాతకంలో ఉండే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు. మీకు అనుకూలంగా అదృష్టాన్ని మార్చుకోవచ్చు. ఇక హోలీ పండుగ నాడు మేష రాశి వారు ఎరుపు రంగును హోలీ ఆడటానికి వినియోగించాలి.

Holi 2024 with lunar eclipse Celebrate with these lucky colors by zodiac signs

మేషరాశి అంగారక గ్రహం ద్వారా పాలించబడుతుంది. అంగారకుడికి ఎరుపు ఇష్టమైన రంగు కాబట్టి, ఈ రంగుతో మేషరాశి వారు హోలీ ఆడుకుంటే మంచిది. వృషభరాశి శుక్రుడుచే పాలించబడుతుంది కాబట్టి వృషభ రాశి వారు హోలీ నాడు తెలుపు మరియు లేత నీలం రంగులను మంచిది. మిధునరాశి బుధగ్రహంచే పాలించబడుతుంది. మిధునరాశి వారు ఆకుపచ్చ రంగును హోలీకి వాడాలని చెప్తున్నారు.

కర్కాటక రాశి చంద్రునితో పాలించబడుతుంది. ఈ రాశి వారు తెలుపురంగును హోలీ కోసం వినియోగిస్తే మంచిది. సింహరాశి సూర్యునిచే పాలించబడుతుంది. సింహరాశి వారు ముదురు ఎరుపు, నారింజ, పసుపు రంగులను హోలీకి ఉపయోగిస్తే మంచిది. కన్యా రాశి బుధ గ్రహంతో పాలించబడుతుంది. కన్యారాశి వారికి ముదురు ఆకుపచ్చ రంగును హోలీకి వాడాలని చెప్తున్నారు. తులారాశి శుక్రుడు చేత పాలించబడుతుంది. తులారాశి వారు పసుపు, తెలుపు హోలీ వేడుకల్లో వినియోగిస్తే మంచిది.

వృశ్చిక రాశి అంగారకుడితో పాలించబడుతుంది. వృశ్చిక రాశి వారికి ఎరుపు మరియు మెరూన్ రంగులు అత్యంత పవిత్రమైన రంగులుగా పరిగణించబడతాయి. ధనుస్సు రాశి బృహస్పతితో పాలించబడుతుంది. వీరు హోలీ నాడు పసుపురంగును ఉపయోగిస్తే మంచిది. శని మకరరాశిని పాలిస్తుంది. నలుపు లేదా ముదురు నీలం రంగులను హోలీకి ఉపయోగిస్తే మంచిది.

శని కుంభరాశిని పాలిస్తుంది. కుంభరాశి వారు నలుపు లేదా ముదురు నీలం శుభ రంగులను ఉపయోగించడం వల్ల కుంభరాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. మీనరాశిని బృహస్పతి పాలిస్తుంది. హోలీ వేడుకల్లో పసుపు రంగును ఉపయోగించటం మంచిది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+