హోలీనాడు 5 అద్భుతయోగాలు.. ఈ రాశులవారికి విలాసాలు, భోగాలు.. రెడీ అవ్వండి!

మార్చి 4వ తేదీన మనం హోలీ పండుగను జరుపుకుంటాం. హోలీ పండుగరోజు గ్రహాలసంచారం శక్తివంతమైన రాజయోగాలను ఏర్పరుస్తుంది. హోలీ పండుగనాడు మాలవ్య రాజయోగం, బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీనారాయణ రాజయోగం, ధనశక్తి యోగంతో పాటు ఐదు శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రాజయోగాలు అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ముఖ్యంగా నాలుగు రాశులవారికి ఈ రాజయోగాలు అదృష్టాన్ని తీసుకు రాబోతున్నాయి మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి

హోలీ పండుగ నాడు ఏర్పడే 5 యోగాలతో వృషభ రాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలు వస్తాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు బలమైన స్థితిలో ఉండి మాలవ్య రాజయోగాన్ని ఏర్పరచడం ఈ రాశి పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు వృషభ రాశి జాతకులను కరుణిస్తాడు. కుటుంబ, వైవాహిక జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

holi on march 4th 5 auspicious yogas on holi these zodiac signs will get wealth health and luck

మిధున రాశి

హోలీ పండుగ నాడు ఏర్పడే ఐదు రాజయోగాలు మిధున రాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తున్నాయి. బుధుడు ఈ రాశిని పాలించే గ్రహం కాబట్టి బుధాదిత్య మరియు లక్ష్మీనారాయణ రాజయోగం ప్రభావం మిధున రాశి వారి జీవితాలపైన ఉంటుంది. మిధున రాశి వ్యాపారులకు ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. ఈ సమయంలో మిధున రాశి వారు లాభాలను ఆర్జిస్తారు.

సింహరాశి

హోలీ పండుగ నాడు ఏర్పడే ఐదు రాజ యోగాల కారణంగా సింహరాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు సింహరాశికి అధిపతి కావడంతో సూర్యుడితో సంబంధం ఉన్న బుధాదిత్య మరియు శుక్రాదిత్య రాజయోగాలు సింహరాశి జాతకులకు మేలు చేస్తాయి. సింహరాశి జాతకుల కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. సమాజంలో వారి ప్రభావం మరియు గుర్తింపు బలపడుతుంది. చాలాకాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న వారు సానుకూల వార్తలను వింటారు.

తులారాశి

హోలీ పండుగ నాడు ఏర్పడే ఐదు రాజ యోగాల కారణంగా తులా రాశి జాతకులు అన్ని విధాల లబ్ధిని పొందుతారు. శుక్రుడు తులా రాశికి అధిపతి కావడంతో మాలవ్య మరియు లక్ష్మీనారాయణ రాజయోగాల ప్రభావం తులారాశి జాతకులపైన ఉంటుంది. ఈ సమయంలో వీరు విలాసాలతో సంతోషంగా జీవిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి ఫలితాలను చూస్తారు.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+