today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి

పరాభవ నామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణ పక్షం, దశమి (అర్ధరాత్రి 01:17 వరకు, ఆ తర్వాత ఏకాదశి), శ్రవణా నక్షత్రం (సాయంత్రం 03:14 వరకు, ఆ తర్వాత ధనిష్ట), సాధ్య యోగం (సాయంత్రం 06:15 వరకు), సాయంత్రం 04:48 నుండి 05:38 వరకు దుర్ముహూర్తం, సాయంత్రం 04:55 నుండి 06:27 వరకు రాహుకాలం, ఉదయం 05:17 నుండి 06:56 వరకు అమృతకాలం ఉంది.

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఏరోజుకు ఆరోజు రాశుల ఫలితాలను గ్రహాలు నిర్దేశిస్తుంటాయి. ఒక్కరోజే కదా ఏముందిలే అని కొట్టిపారవేయడానికి వీల్లేని విధంగా ఒక్కోసారి అద్భుత ఫలితాలుంటాయి. ఈనెల 12వ తేదీన అన్ని ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. ఆదివారం మీన రాశిలో శనిదేవుడి ప్రత్యక్ష సంచారం ప్రారంభమవుతోంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.

Horoscope for April 12 Income is expected to improve and any ongoing property disputes are likely to be resolved

మేష రాశి

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. స్థిరంగా తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృషభ రాశి

దైవానుగ్రహంతో నిలిచిపోయిన పనులు అనూహ్యంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.

మిథున రాశి

శని దేవుని ప్రభావం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. కెరీర్ పరంగా గొప్ప పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరిగినప్పటికీ, విలాసాల కోసం ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

కర్కాటక రాశి

పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారుల నుంచి లక్ష్యాల విషయంలో ఒత్తిడి ఎదురవుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి.

సింహ రాశి

ఆర్థిక వ్యవహారాలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. రావలసిన బాకీలు చేతికి అందుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.

కన్యా రాశి

ఉద్యోగంలో పనిభారం పెరగడం వల్ల కొంత అసహనానికి గురవుతారు. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. పట్టుదలతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.

తులా రాశి

వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయం. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చిక రాశి

మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ఖర్చులను నియంత్రించుకోవాలి.

ధనుస్సు రాశి

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తిలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

మకర రాశి

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

కుంభం రాశి

శని సంచారం వల్ల మీ వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మీన రాశి

మీ రాశిలోనే శని ఉదయించడం వల్ల బాధ్యతలు రెట్టింపు అవుతాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. శివారాధన చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+