Horoscope today: ఈ రాశులవారికి అన్నింటా విజయాలు... మీరున్నారా?
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం మానవ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిరోజు గ్రహాల మార్పు ద్వాదశ రాశుల వారికి సానుకూల, ప్రతికూల ఫలితాలను ఇస్తాయన్న విషయం తెలిసిందే . నేడు తులా రాశి నుండి మీన రాశి వరకు వివిధ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.
తులారాశి
తులా రాశి వారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నేడు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపొద్దు. నేడు తోటి వారి సహకారంతో మీరు ఒక పనిని పూర్తి చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం మీకు మంచి చేస్తుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి వ్యాపారాలు నేడు లాభదాయకంగా ఉంటాయి. ఎన్ని ఇబ్బందులనైనా నేడు మనోధైర్యంతో ఎదుర్కొంటారు. అయితే అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త. ప్రయాణాలు చేసేవారు నేడు జాగ్రత్తగా ఉండాలి. ఇక అప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రుణ విమోచక అంగారక స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నేడు మంచి కాలం. మీరు ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. నేడు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. మీ ప్రతిభతో మీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించడం శుభప్రదం.
మకర రాశి
మకర రాశి వారు తోటి వారి సహకారంతో పనులను పూర్తిచేస్తారు. మకర రాశి వారికి కుటుంబ సభ్యులపై చూపించే ప్రేమ నేడు సత్ఫలితాలను ఇస్తుంది. అస్థిరమైన బుద్ధి వల్ల ఈరోజు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం చదివితే నేడు లాభదాయకంగా ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశి జాతకులు ఈరోజు సంపూర్ణ మనోబలంతో విజయాలు సాధిస్తారు. చాప కింద నీరులా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేడు ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కలహాలతో కాలాన్ని వృధా చేసుకోకూడదు. గణపతిని ధ్యానం చేయడం మంచిది.
మీన రాశి
మీన రాశి జాతకులు ముందుచూపుతో వ్యవహరించాలి. ముందస్తు ప్రణాళికలు చేసుకుంటేనే కాస్త తగ్గుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటేనే మంచిది. నేడు వీరు ఆదిత్య హృదయం పారాయణం చేస్తే సత్ఫలితాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications