Horoscope today: నేడు వీరికి సంపదలు.. అన్నీ శుభాలు.. పండుగ చేసుకోండి!
నేటి డిసెంబర్ 4వ తేదీ గురువారం. ఈ రోజు ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంటుంది. గ్రహాల సంచారం కారణంగా ఈరోజు ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది? నేడు ఎవరు జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
నేడు మేషరాశి జాతకులు ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. పై అధికారులతో కలుపుకొని పోయే మనస్తత్వంతో ముందుకు సాగాలి. నేడు మీరు ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులు నేడు మీ మీ రంగాలలో మంచి పేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థికంగా ఎదుగుదలకు అవకాశం ఉంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి.
మిధున రాశి
మిధున రాశి వారు ఈ రోజు అనుకోని ఖర్చులను పెట్టాల్సి వస్తుంది. శ్రమ అధికమవుతుంది. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధించినప్పటికీ, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యతనిచ్చి పని చేయండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నేడు ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. చేసే పనిలో మిత్రుల సహాయం లభిస్తుంది. సుఖ సౌఖ్యాలతో జీవిస్తారు.
సింహరాశి
నేడు సింహరాశి జాతకులు ఆటంకాలను అధిగమించి పనులను పూర్తిచేస్తారు. ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
కన్యారాశి
నేడు కన్యా రాశి జాతకులు పెద్దల నుంచి మన్ననలు పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మంచి వాళ్లతో మీకు పరిచయాలు ఏర్పడతాయి.
తులారాశి
తులారాశి జాతకుల సంకల్పాలు నెరవేరుతాయి. నేడు అనవసరపు ఖర్చులు చేస్తారు. ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రతిభ, పనితీరు ప్రశంసించబడతాయి. ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలను చూస్తారు.
ధనుస్సు రాశి
నేడు ధనుస్సు రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో పనులను పూర్తిచేస్తారు. అయితే ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది.
మకర రాశి
మకర రాశి వారు నేడు మానసిక ప్రశాంతత కోల్పోకుండా చూసుకోవాలి. ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మకర రాశి వారికి ఆర్థిక నియంత్రణ చాలా అవసరం.
కుంభరాశి
కుంభ రాశి వారికి నేడు మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు.
మీనరాశి
మీనరాశి జాతకులు ఆశించిన ఫలితాలు రాబట్టడానికి కష్టపడాల్సి వస్తుంది. క్షమాగుణం తో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే నేడు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
-
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications