చతుర్గ్రాహి యోగంతో నేడు వీరికి నాలుగు చేతులా సంపాదన.. వీరిదే లక్కంటే!

ఈరోజు మంగళవారం జనవరి 6వ తేదీ.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అదే సమయంలో ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం బలంగా ఉంటుంది. గ్రహస్థితుల పరంగా సూర్యుడు, కుజుడు, చంద్రుడి,బుధుడు కలయికతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది.

చతుర్గ్రాహి యోగంతో పాటు ఈ యోగాలు
చతుర్గ్రాహి యోగంతో పాటు ప్రీతి, ఆయుష్మాన్, సర్వార్ధ సిద్ధి వంటి అనేక శుభయోగాలు కూడా ఇవాళ ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ ప్రత్యేకమైన గ్రహ, నక్షత్ర సమీకరణల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుండగా, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు, స్వల్ప ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఇక నేడు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఇలా ఉన్నాయి.

horoscope today luck to these zodiac signs with chaturgrahi yoga and many auspicious yogas

మేష రాశి
మేషరాశి జాతకులు నేడు సానుకూలతలను చూస్తారు. ఆర్ధికంగా, వృత్తి పరంగా పురోగతి ఉంటుంది. చేపట్టే పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి తల్లిదండ్రుల ప్రేమ పుష్కలంగా లభిస్తుంది. నేడు వృషభ రాశి జాతకులు ఏ పని చేసినాపురోగతి కనిపిస్తుంది. అన్ని విధాలా ఈ సమయం లాభాదాయకం. కానీ ప్రయాణాలు చేసే వారు జాగ్రత్త.

మిధున రాశి
మిధున రాశి వారికి ఈ రోజు ఆర్ధిక పురోగతి ఉంటుంది.. చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు సానుకూల ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో ఏ పని చేసినా మంచి జరుగుతుంది. చేసే పనులలో దైవ సహాయం లభిస్తుంది. ఆర్ధిక ప్రయోజనాలు చేకూరుతాయి.

సింహ రాశి
సింహరాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నేడు వీరికి కష్టానికి తగిన ఫలితం ఉన్నా, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.

కన్య రాశి
కన్యా రాశి జాతకులకు నేడు అన్ని విధాలా లాభం జరుగుతుంది. కేవలం ఉద్యోగాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు కూడా చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి.

తులారాశి
నేడు వీరికి అత్యంత శుభదినం. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. స్నేహితుల సహాయం లభిస్తుంది. ప్రయాణ సూచనలు ఉన్నాయి.

వృశ్చిక రాశి
నేడు వృశ్చిక రాశి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారి ఆత్మ విశ్వాసం నేడు పెరుగుతుంది.ధనుస్సు రాశి జాతకులు వ్యాపారంలో లాభాలు పొందుతారు. కుటుంబం నుంచి శుభవార్తలు వింటారు.

మకర రాశి
మకరరాశి వారు ఏ పని చేసినా మంచి ఫలితం వస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది.ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.

కుంభ రాశి
నేడు కుంభరాశి వారికి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కృషితో ఫలితాలు పొందగలరు.

మీన రాశి
మీనరాశి జాతకులు నేడు శుభవార్తలు వింటారు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+