horoscope today: వీరికి మూకుమ్మడిగా సంపదలను ఇచ్చే ముఖ్య గ్రహాలు.. నేడు వీరికి జాక్ పాట్!

నేడు డిసెంబర్ 10 బుధవారం. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ రాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు వస్తాయి? ఈరోజు గ్రహాల సంచారం ఎవరికి లాభాన్ని చేకూరుస్తుంది? వంటి వివరాలను తెలుసుకుందాం.

నేడు గ్రహాల సంచారం ఇలా

సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. చంద్రుడు నేడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు ధనుస్సు రాశిలో సంచారం చేస్తుంటే, బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఇక బృహస్పతి మిధున రాశిలో వక్రి స్థితిలో ఉంటే,శుక్రుడు వృశ్చిక రాశిలో, శని మీనరాశిలో ఉన్నారు.

Horoscope today The main planets that give them wealth Today is the jackpot for them

మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు కొత్త బాధ్యతలు వస్తాయి. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ఫలితాలే వస్తాయి. అయితే ఈరోజు మేషరాశి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంతో సంతోషంగా ఉండాలి.

వృషభ రాశి
వృషభ రాశి వారు ఏ పని చేసిన నేడు కలిసి వస్తుంది. డబ్బు, ఆరోగ్యం సంబంధాలలో వృషభ రాశి వారు మంచి నిర్ణయాలను తీసుకుంటారు. పనిలో ప్రశంసలు పొందే అవకాశం ఉంది.

మిధున రాశి
మిధున రాశి వారు ఈ రోజు కమ్యూనికేషన్ లో కీలకంగా వ్యవహరించాలి. చెప్పే మాటలు జాగ్రత్తగా చెప్పాలి. ప్రయాణ సూచనలు ఉన్నాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఆర్థిక విషయాలలో నేడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఖర్చుల మీద కంట్రోల్ అవసరం. కుటుంబ విషయాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.

సింహరాశి
సింహ రాశి వారి ఆత్మ విశ్వాసం నేను పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు.

కన్యారాశి
కన్యా రాశి వారికి అలసట, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పనిలో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రయోజనాలే వస్తాయి. ఈరోజు కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిదని సలహా.

తులారాశి
తులారాశి జాతకులు స్నేహితుల పరిచయాలతో మంచి సమయాన్ని గడుపుతారు. కొత్త ప్లాన్లు, కొత్త అవకాశాలు కనిపిస్తాయి. డబ్బు ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఖర్చవుతుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఇది కెరీర్లో పవర్ఫుల్ రోజు. వృశ్చిక రాశి వారి అభిప్రాయాలు గౌరవించబడతాయి. ఇంట్లో పెద్దవాళ్ల మాటలు వినడం శాంతినిస్తుంది.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి లెర్నింగ్ మరియు గ్రోత్ పైన మంచి దృష్టి ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం దొరుకుతుంది. దూర సంబంధాలలో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది.

మకర రాశి
మకర రాశి జాతకులు రహస్యంగా ఉన్న పనులను పూర్తిచేస్తారు. ఆర్థిక లాభం వస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

కుంభరాశి
కుంభరాశి వారి సంబంధాలలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. జీవిత భాగస్వామితో మంచి క్లారిటీ వస్తుంది. నేడు పని ఒత్తిడి తగ్గుతుంది.

మీనరాశి
మీన రాశి వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. కళలు, రచనలు, సంగీతం వంటి రంగాలలో ప్రగతి ఉంటుంది. కొంత భావోద్వేగం ఎక్కువైనా మీన రాశి వారికి నేడు మొత్తం అనుకూలంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+