Horoscope today: నేడు వీరికి అదృష్టదినం: ఈ రాశులవారిపై శని అనుగ్రహం; మీరున్నారా?
జులై 15 శనివారం అదృష్ట దినం. ఈరోజు శని ఆశీస్సులు ముఖ్యంగా నాలుగు రాశుల పైన ప్రత్యేకంగా ఉంటాయి. శని ఆశీర్వాదంతో నాలుగు రాశుల వారికి కష్టాలు దూరమవుతాయి. శని అనుగ్రహం కారణంగా జూలై 15వ తేదీన అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏమిటో? వారికి ఎటువంటి ఫలితాలు నేడు కలుగుతాయో ప్రస్తుతం తెలుసుకుందాం.
వృషభ రాశి:జులై 15 వృషభ రాశి వారికి శని ఆశీస్సులతో అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి వారి ఇళ్లల్లో శుభకార్యాలు జరుగుతాయి. తల్లి నుండి సహకారం అందడం మాత్రమే కాకుండా, తోబుట్టువుల సహకారం కూడా అందుతుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు సాకారం అవుతాయి.

వృషభ రాశి వారు దుస్తులు మరియు ఇతర బహుమతులు స్వీకరించే అవకాశం ఉంటుంది. వాహన యోగం ఉంది .ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి, మార్పు జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పై అధికారుల నుండి సహాయం కూడా అందుతుంది.
కర్కాటక రాశి :జులై 15వ తేదీ కర్కాటక రాశి వారికి శని అనుగ్రహంతో మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది. తల్లి నుండి కర్కాటక రాశి వారికి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పై అధికారుల సహాయం బాగా అందుతుంది. వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు ఆర్థికంగా లబ్ధిని పొందే అవకాశం ఉంది. వృత్తిపరంగా మార్పులు జరగొచ్చు.
ధనుస్సు రాశి :జులై 15వ తేదీ ధనుస్సు రాశి వారికి శని ఆశీస్సులతో బాగా కలిసి వస్తుంది. వారికి జీవితం తృప్తిగా అనిపిస్తుంది. వారు ఎదురు చూస్తున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి సహకారం లభిస్తుంది. కుటుంబం నుండి కూడా సహాయం అందుతుంది. విద్యారంగానికి సంబంధించిన వారికి ముఖ్యంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చిక రాశి:జులై 15వ తేదీ వృశ్చిక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. శని ఆశీర్వాదంతో వృశ్చిక రాశి వారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. స్నేహితుల సహాయంతో వ్యాపార విస్తరణ సాధ్యమవుతుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబం నుంచి పూర్తిగా మద్దతును పొందగలుగుతారు. అన్ని విధాలుగా వృశ్చిక రాశి జాతకులకు జులై 15 కలిసొస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications