horoscope today: నేడు చంద్రగ్రహణంతో కూడిన హోలీ.. ఈ రాశులవారు జాగ్రత్త!!
ఈరోజు హోలీ.. అంతే కాదు చంద్రగ్రహణం కూడా.. ఈరోజు గ్రహాల గమనం వల్ల అనేక రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. ఈరోజు ఏ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి జాతకులు ఈరోజు విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు నేడు అనుకూలమైన సమయం. ఇష్ట దేవతను ఆరాధన చేయడం శుభప్రదంగా సూచించబడింది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా ఈరోజు వృషభ రాశి వారికి బాగా ఉంటుంది. మీ మీ రంగాలలో ఓర్పు, సహనం, పట్టుదలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృధా చేయకుండా ఉంటే మంచిది. ఇష్టదేవతలను ఆరాధించడం నేడు శుభప్రదంగా చెప్పబడింది.
మిధున రాశి
మిధున రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మిధున రాశి జాతకులు నేడు మాట పట్టింపులకు పోకుండా ఉండాలి. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఓర్పుతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు నేడు శుభవార్తలు వింటారు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. ఇష్టమైన ఆహారాన్ని తింటారు. శారీరిక సౌఖ్యం కూడా కలుగుతుంది. కర్కాటక రాశి జాతకులు నేడు ఆంజనేయుని ఆరాధించడం మంచిది.
సింహరాశి
సింహరాశి జాతకులు చిత్తశుద్ధితో చేసే పనులు నేడు సత్ఫలితాలను ఇస్తాయి. మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. సింహరాశి జాతకులు నేడు ఆంజనేయస్వామి సందర్శన చేయడం శుభప్రదం.
కన్యారాశి
కన్యా రాశి జాతకులకు నేడు శుభప్రదం గానే ఉంటుంది. కన్య రాశి జాతకుల బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. స్థానచలనం చేసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పైన ముఖ్యంగా శ్రద్ధ పెట్టాలని సూచించబడింది. దుర్గాదేవిని ఆరాధించటం కావలసిన శక్తిని ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications