today rasi phalalu: నేడు వీరి జీవితాల్లో వెలుగులు... వీరు జాగ్రత్త!
నవంబర్ 26 2025 బుధవారం నాడు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి. ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ రాశి వారికి ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది? వంటి వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
మేష రాశి
మేషరాశి జాతకులు ఈరోజు కొన్ని ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. నేడు కొన్ని పనులను పూర్తి చేయాలి అనుకుంటే సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే మంచిది. చేసే పనుల విషయంలో కాస్త ఓపిక కూడా ఉండాలి.

వృషభ రాశి
వృషభ రాశి వారు ఈ రోజు వారు అనుకున్నది చేయడానికి మంచి రోజు. నేటి నుంచి వృషభ రాశి వారికి చేసే పనులలో స్పష్టత ఉంటుంది. ఏ పని చేసిన మనసుపెట్టి చేస్తే మంచిది.
మిధున రాశి
మిధున రాశి జాతకులు నేడు వృత్తిపరమైన విజయాలను పొందుతారు. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ ఆఫీసు రాజకీయాలలో తల దూరిస్తే చాలా ప్రతికూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఆధ్యాత్మిక పురోగతి పెరుగుతుంది ఈరోజు వీరి శక్తి సానుకూలంగా ఉంచుకోవలసిన అవసరం ఉంది.
సింహరాశి
సింహరాశి జాతకులకు నేడు వారి ఆశయాలు నెరవేరుతాయి. ఎలాంటి సమస్యలు లేకుండా పనులు చేసుకోవచ్చు. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ముందుకు సాగాలి.
కన్యారాశి
కన్యా రాశి వారి చుట్టూ ఈరోజు అరుదైన శక్తి ప్రవాహం కనిపిస్తుంది. ఆ శక్తి ప్రవాహం మసక బారే ముందే దానిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.
తులారాశి
తులా రాశి వారు ఈ రోజు సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచన. ఈరోజు ఎటువంటి తొందరపాటు లేకుండా నిదానంగా స్థిరంగా పనులను పూర్తి చేసుకోవాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విలాసాల కోసం డబ్బులను ఎక్కువగా ఖర్చు చేయడం వృశ్చిక రాశి వారి బడ్జెట్ ను దెబ్బతీస్తుంది.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి నిజాయితీ అంతర్గత శక్తిని ఇస్తుంది. మిమ్మల్ని మీరు అంగీకరించడం ద్వారా ఈ రోజు నిజమైన బలాన్ని పొందుతారు. ఈరోజు సానుకూలంగా ఉంటుంది
మకర రాశి
మకర రాశి వారికి నేడు పనిలో విజయం లభిస్తుంది. కానీ సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు.
కుంభరాశి
కుంభ రాశి వారికి అదృష్టం బలంగా మద్దతుని ఇస్తుంది. కుంభ రాశి వారు అడ్డంకులను అధిగమించడానికి ఇది సహాయపడుతుంది. కార్యాలయంలో కుంభ రాశి వారు విజయం సాధించే అవకాశం ఉంది.
మీన రాశి
మీన రాశి వారికి ఆర్థిక స్థిరత్వం, పొదుపు మెరుగుపడుతుంది. ఈరోజు మీనరాశి జాతకుల కుటుంబంలో కొన్ని ఉద్రిక్తతలను చూస్తారు. తండ్రి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications