ఇంట్లో వాస్తు దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి?
ప్రతి ఒక్కరు తమకు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వాటినుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తుంటారు. లోపం ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూ పండితులను, వాస్తు నిపుణులను కలుస్తుంటారు. వారు చెప్పిన దాని ప్రకారం చేస్తుంటారు. కుటుంబంలో తరుచుగా గొడవలు వస్తుండటం, ఆరోగ్య పరంగా సమస్యలు, ఆర్థిక సమస్యలు, కెరీర్ కు అడ్డం పడే పనులు కలుగుతుంటే వాటిని గుర్తించాలి.
ఇంటి నిర్మాణంలో లోపాలు ఉన్నాయేమోనని నిపుణులచేత పరిశీలన చేయించాలి. ప్రధానంగా ఈశాన్ం లేదంటే నైరుతి దిశల్లో సమస్యలు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంటాయి. అప్పుడు వాస్తు నిపుణులు చెప్పినట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది.

ఆర్థిక, కుటుంబ సమస్యలు
ఖర్చులు అనుకోకుండా పెరగడం, డబ్బులు నిలవకపోతుండటం, ఆదాయం దెబ్బతినడం, తరుచుగా నష్టాలు వస్తుండటం, అప్పులు ఎక్కువగా ఉండటంలాంటివన్నీ సమస్యలే. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం లేకపోవడం, భార్యాభర్తలిద్దరూ ఒకర్నొకరు అర్థం చేసుకోకపోవడం, కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తుండటం, గర్భిణీలకు ఇబ్బందులు కలుగుతుండటం లాంటివన్నీ గమనించి వాటికి పరిష్కారం కనుగొనాలి.
కెరీర్ సమస్యలు
మానసికంగా ఒత్తిడికి గురవుతుండటం, ఆందోళన నెలకొనడం, ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందడం, ప్రతి పనికి అడ్డంకులు ఎదురవుతుండం, కెరీర్ పరంగా ఇబ్బందులు, తోటి ఉద్యోగులతో గొడవలు, అభివృద్ధి లేకపోవడంలాంటివన్నీ సమస్యలే. వాటిని గుర్తించి వాస్తు నిపుణులను కలిసి ఎక్కడ సమస్య ఉందో తెలుసుకొని దాన్ని పరిష్కరించాలి.
వాస్తు పరంగా ఎక్కడ లోపం ఉందో తెలుసుకోండి
ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో ఉందో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే దిక్సూచిని వాడాలి. ఇంటి వివరాలు, గదుల అమరిక, కిటికీలు, మెట్లు వంటి వాటిని వాస్తు కాలిక్యులేటర్లలో సరిగా ఉన్నాయా? లేదా? అని తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా అనుమానం ఉంటే మంచి వాస్తు నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.












Click it and Unblock the Notifications