త్వరలో ధనపు రాశులను వారింటికి దొర్లించే రుచక రాజయోగం!
వేద జ్యోతిషశాస్త్రంలో కుజగ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కుజుడు ధైర్యము, సాహసం, నాయకత్వం, వ్యూహరచన వంటి లక్షణాలకు ప్రతీకగా చెబుతారు. అక్టోబర్ 27వ తేదీన కుజుడు సొంత రాశి అయిన వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో రుచక మహారాజ యోగం ఏర్పడుతుంది. ఇది పంచ మహాపురుష యోగాలలో ఒకటి. ఈ శుభయోగం కారణంగా ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
మిధున రాశి
రుచక రాజయోగంతో మిధున రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తిపరంగా వీరికి పురోగతి లభిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. మిధున రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహరాశి
రుచక రాజయోగంతో సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు బస్సులు అవుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
కన్యారాశి
రుచక రాజయోగంతో కన్యారాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కన్యారాశి వారు కొత్త బాధ్యతలను తీసుకోవలసి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం బాగుంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి రుచక రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది.చాలాకాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
కుంభరాశి
రుచక రాజయోగం కుంభ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభ రాశి జాతకులు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలు పొందుతారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications