విజయదశమి నాడు ఈ పనులు చేస్తే ఈ ఏడాదంతా విజయలక్ష్మి కటాక్షం!

త్వరలో దసరా పండుగను జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు సిద్ధమవుతున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగకు సమయం దగ్గర పడుతుంది. ఈసారి విజయదశమి పండుగను అక్టోబర్ 12వ తేదీ శనివారం నాడు జరుపుకోనున్నారు. ఇక విజయదశమి రోజు వివిధ రాశులలో గ్రహాల కలయికలు, గ్రహాల సంచారం జరుగుతుంది.

విజయ దశమి పండుగ.. ప్రత్యేక పరిహారాలు
ఈ కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయని, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మనం కొన్ని ప్రత్యేక పరిహారాలు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. మరి విజయదశమి రోజు చేయవలసిన ప్రత్యేక పరిహారాలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

If you do these things on Vijayadashami Vijayalakshmi blessings for whole year

దసరా రోజు ఈ పని తప్పక చెయ్యండి
ఈసారి దసరా పండుగ శనివారం రోజున వస్తుంది. శనివారం శనికి చాలా ఇష్టమైన రోజు శని దేవుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాదు శని యొక్క సడే సతి విజయదశమి రోజున ముగియనుండడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.ఈరోజు ఎవరైతే శని పూజ చేస్తారో వారికి దరిద్రం పోతుంది.

ఈ చెట్టుకు పూజ చేస్తే మంచిది
దసరా పండుగ రోజున చెయ్యాల్సిన మరో పని కూడా ఉంది. తెల్లవారుజామున నిద్రలేచి శమీ వృక్షం దగ్గరకు వెళ్లి దర్శనం చేసుకుని తర్వాత దానికి నీటిని సమర్పించి శమీ వృక్షం వద్ద దీపాన్ని వెలిగించి పూజలు జరిపితే మంచిది. లక్ష్మీదేవి ప్రసన్నమై ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.

ఇలా చేస్తే ఇబ్బందులకు చెక్
ఈరోజు శమీ వృక్షాన్ని పూజిస్తే జాతకంలో ఉన్న శని దోష నివారణ జరుగుతుందని చెబుతారు. శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని స్మరిస్తూ చెట్టు చుట్టూ ప్రదక్షణలు చేసి పూజించడం వల్ల జీవితంలోని ఇబ్బందులు పోయి సంతోషంగా బతుకుతారు.

If you do these things on Vijayadashami Vijayalakshmi blessings for whole year

ఇలా చేస్తే సకల శుభాలు
శమీ వృక్షం వద్ద ఏడు రోజులపాటు నువ్వుల నూనెతో దీపం వెలిగించి పూజించినా కుటుంబ సమస్యలన్నీ దూరమై, ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని చెప్తారు. విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి పూజ తర్వాత జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు పొందాలి. ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. .

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+