దసరా పండుగకు శంఖుపూలతో ఇలా చేస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసం!
దసరా పండుగ వచ్చేసింది. దసరా పండుగ రోజు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అందరిపైనా తన కటాక్షాన్ని చూపిస్తారని భక్తులు విశేషంగా నమ్ముతారు. అంతేకాదు దసరా రోజు చేసే పూజలు కూడా చాలా ప్రత్యేకం అని చెప్తారు. దసరా రోజు పూజలో శంఖు పూలతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు.
అపరాజిత పుష్పాలతో పరిహారాలు
విజయదశమి పండుగ నాడు విజయాలను చేకూరుస్తుంది దుర్గమ్మ. ఈ పండుగ నాడు హిందూధర్మం ప్రకారం అపరాజిత దేవిని కూడా పూజిస్తారు. దుర్గాదేవి అంశతో అపరాజిత దేవి ఉద్భవించింది. దీంతో దసరా నాడు అపరాజిత దేవిని కూడా పూజించే ఆచారం ఉంది. ఈ క్రమంలో దసరా పండుగ రోజున జీవితంలో అనేక సమస్యల నుంచి బయట పడాలనుకునేవారు శంఖుపూలుగా పిలవబడే అపరాజిత పుష్పాలను ఉపయోగించి కొన్ని పరిహారాలు చేయడం ఎంతో మంచిది.

ఇంట్లో పేదరికం పోవాలంటే ఇలా చెయ్యండి
ఇలా చేయడం కారణంగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. చాలామంది ఇళ్లలో ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. విపరీతంగా ఖర్చులు పెరిగాయని డబ్బు ఆదాయం చేయలేకపోతున్నామని బాధపడేవారు దసరా రోజు ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో శంఖుపూలు వేయాలి. ఆ పాత్రను ఈశాన్యం మూలలో ఉంచితే ఇంట్లో పేదరికం పోతుంది.
శంఖు పూలను ఇక్కడ పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం
ఇక లక్ష్మీదేవికి శంఖు పూలు అంటే చాలా ఇష్టం. ఎవరైతే దసరా పండుగ రోజున లక్ష్మీదేవికి శంఖు పూలతో పూజ చేస్తారో ఆ తరువాత ఆ పూలను పర్సులో జాగ్రత్తగా పెట్టుకుంటారో వారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. శంఖు పూలను డబ్బు నిలువ చేసే ఒక ప్రదేశంలో ఎర్రటి వస్త్రంలో కట్టి ఉంచితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ధన ప్రవాహం పెరుగుతుంది.
దసరా రోజు ఆర్ధిక ఇబ్బందులతో ఉంటే ఇలా చెయ్యండి
ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు దసరా రోజు చంద్రుడికి అపరాజిత పూలను సమర్పించాలి. ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించేలా చేస్తుంది. అలాగే కుటుంబంలో సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతుంటే దసరా రోజు స్నానం చేసే నీటిలో శంఖు పూలు వేసుకొని చేయాలి.
శనీశ్వరుడికి పూజ చేస్తే కూడా శని అనుగ్రహం
ఇలా చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి ప్రశాంతత ఉంటుంది. ఇక శంఖు పూలు శనీశ్వరుడికి కూడా ఇష్టమైన పువ్వులు కావడంతో ఈసారి దసరా శనివారం రావడంతో శనీశ్వరుడికి పూజ చేస్తే కూడా శని అనుగ్రహం కలుగుతుంది. శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. మొత్తంగా శంఖు పూలతో చేసే పరిహారాలతో ఈ దసరా పండుగకు మీ ఇంటిని లక్ష్మీనివాసంగా మార్చుకోండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications