2025లో మూడు రాశుల్లో తిరుగుతూ వీరికి డబ్బుల మూటలు పంపనున్న బృహస్పతి!

వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జ్ఞానానికి ప్రతీకగా భావించే గురువు 2025 సంవత్సరంలో మూడుసార్లు రాశిని మార్చుకోబోతున్నాడు. కొత్త సంవత్సరం దేవగురువు బృహస్పతి తన రాశిని మూడుసార్లు మార్చుకోనున్న నేపథ్యంలో మూడు రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. 2025 మే 14వ తేదీ వరకు బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తాడు.

2025లో మూడు సార్లు బృహస్పతి సంచారం
అనంతరం మే 14వ తేదీ 2025 సంవత్సరంలో వృషభ రాశి నుంచి బృహస్పతి మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆపై అక్టోబర్ 18న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ మూడవ తేదీన బృహస్పతి మళ్ళీ దాని తిరోగమన స్థితిలో మిధునంలోకి ప్రవేశిస్తాడు. ఇలా మూడు రాశులలో 2025లో బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలను చేకూరుస్తుంది. వీరికి అన్ని విషయాలలోనూ లబ్ధి జరుగుతుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

In 2025 Jupiter is throwing bundles of money to these three zodiac signs

వృషభ రాశి
బృహస్పతి సంచారం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. 2025 సంవత్సరంలో ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి. కుటుంబ సభ్యులు, సహ ఉద్యోగులతో సంబంధాలు బలపడతాయి. బృహస్పతి అనుగ్రహంతో అభివాహితులకు వివాహాలు జరిగే అవకాశం ఉంది. వివాహితులకు జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.

మిధున రాశి
మిధున రాశి వారికి బృహస్పతి 2025 సంచారం ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి చేతికందుతాయి. ఆర్థికపరంగా లాభం జరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది లాభాలను ఇచ్చే కాలం. వ్యాపారాలు వృద్ధి చేసుకునేందుకు ఇది అనుకూలమైన సమయం. వ్యక్తిగతంగాను, వ్యాపార పరంగాను ఈ సమయంలో బలపడతారు. ఆర్థిక లాభాలతో సంతోషంగా జీవిస్తారు.

సింహరాశి
సింహ రాశి వారికి బృహస్పతి రాశి గమనం 2025లో ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మీకు అదృష్టం పూర్తిగా మద్దతుగా ఉంటుంది. ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం. అదృష్టవశాత్తు అనుకోకుండా కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వృత్తిపరమైన సంబంధాలు బలోపేతం చేయడానికి కూడా ఇది చక్కని సమయం. జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+