2025 లో రాహు కేతువుల వలన కుబేరులయ్యే రాశులు... మీరున్నారా?

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ద్వాదశ రాశులవారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా నవగ్రహాలలో రాహువు, కేతువు అంటేనే అందరూ భయపడతారు. రాహు,కేతులను నీడ గ్రహాలుగా చెబుతారు. సహజంగా అశుభాలను ఇచ్చే గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే రాహు,కేతువులు శుభ ఫలితాలను కూడా ఇస్తాయి అనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి.

రాహువు ప్రస్తుతం మీనరాశిలో, కేతువు కన్యారాశిలో
రాహు కేతువుల గమనం చాలా నిదానంగా ఉంటుంది. ఈ రెండు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రయాణం చేసేందుకు 18 నెలల సమయం పడుతుంది. 2023 అక్టోబర్ 30వ తేదీన రాహు కేతువుల సంచారం జరిగింది. 2023 అక్టోబర్ 30 నుండి 2025 మే 18 వ తేదీ వరకు రాహువు మీనరాశిలోనూ, కేతువు కన్య రాశిలోనూ ఉంటాయి.

In 2025 Rahu-Ketu transits into aquarius and leo makes you wealthy

2025లో రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో
ఆ తర్వాత 2025 మే 19వ తేదీ నుంచి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది అదే రోజు కేతువు కూడా సింహరాశిలోకి సంచారం చేస్తుంది.
రాహు కేతువులు రెండు ఎప్పుడూ తిరోగమన దిశలోనే సంచరిస్తాయి. వచ్చే సంవత్సరం ఈ రెండు నీడ గ్రహాలు ఒకేరోజు రాశులను మార్చుకోవడం వలన ముఖ్యంగా రెండు రాశుల వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు రాశులవారు రాహు కేతువుల కటాక్షంతో సిరిసంపదలతో తులతూగబోతున్నారు.

కుంభరాశిఫై రాహువు ప్రభావం
కుంభరాశి లోకి రాహువు ప్రవేశిస్తున్న కారణంగా కుంభ రాశి వారిపై రాహువు యొక్క ప్రభావం గణనీయంగా ఉంటుంది. 2025 సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశికి అధిపతి అయిన శని కుంభరాశిలోనే ఉండడం వల్ల శని రాహువు మధ్య స్నేహభావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో రాహు ప్రభావం కుంభ రాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.

రాహువు సంచారంతో శుభ ఫలితాలు
రాహువు సంచారంతో కుంభ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మే 19 2025 నుంచి రానున్న 18 నెలల కాలం కుంభ రాశి వారు సిరిసంపదలతో తుల తూగబోతున్నారని సమాచారం. ఈ సమయంలో కుంభ రాశి వారు అనుకున్న కలలన్నీ నెరవేరుతాయి.

సింహరాశిలో కేతువు ప్రభావం ఇలా
2025 సంవత్సరంలో అదృష్టం తలుపు తట్టే మరొక రాశి సింహరాశి. సింహరాశి వారిపై కూడా కేతువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. 2025 మే 19వ తేదీ నుంచి కేతువు సింహరాశిలో తిరోగమనములో సంచరిస్తుంది. ఫలితంగా రానున్న 18 నెలల కాలం వీరికి శుభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు ఏ పని చేసిన విజయం ప్రాప్తిస్తుంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి ధన ప్రవాహం కూడా రెట్టింపు అవుతుంది. సిరిసంపదలతో సింహరాశి వారు సంతోషంగా గడుపుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+