2025లో ఈ రాశులవారికి అఖండ ధనయోగం అనుగ్రహించిన శని!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శనిని అత్యంత క్రూరమైన గ్రహాలలో ఒకటిగా చెబుతారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. శని దేవుడు క్రమశిక్షణ నేర్పే దేవుడు. న్యాయదేవతగా శని దేవుడిని పరిగణిస్తారు. అటువంటి శనిగ్రహం ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు .మార్చి 29 2025న శని దేవుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి సంచరిస్తాడు.
మీనరాశిలో శని సంచారం
బృహస్పతి గ్రహానికి చెందిన రాశి చక్రమైన మీన రాశిలోకి శని దేవుడి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. అప్పటివరకు సడే సతితో ఇబ్బంది పడుతున్న వారంతా దాని నుండి విముక్తి పొందుతారు ఇక శని మీన రాశిలోకి ప్రవేశించిన రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఇక మీనరాశిలో శని సంచారం కారణంగా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
శని వృషభ రాశి యొక్క తొమ్మిదవ మరియు 10వ గ్రహాలను పాలించే గ్రహం. మీనరాశిలో శని సంచారం చేసేటప్పుడు 11 వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా వృషభ రాశి జాతకులకు అనేక విషయాలలో లాభాలు జరుగుతాయి. మీనరాశిలోకి శని సంచారం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
వృషభ రాశి వారి పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేస్తారు . ఈ సమయంలో ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు.
మిధున రాశి
శని దేవుడు మిధునరాశిలో 8వ మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా ఉంటాడు. మీన రాశిలో శని దేవుడు సంచరించే సమయంలో శని పదవ ఇంట్లో ఉంటాడు. మిధున రాశిని పాలించే గ్రహమైన బుధుడు మరియు శని మధ్య స్నేహపూర్వక సంబంధం ఉండడం వల్ల శని సంచారం మిధున రాశి వారికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వీరు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు.
అనవసరమైన ఖర్చుల నుండి ఉపశమనం లభిస్తుంది. మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి ఉంటుంది. చాలా కాలంగా నెరవేరని కోరికలు ఇప్పుడు తీరుతాయి. మిధున రాశి జాతకుల ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ లో మంచి ప్రయోజనాలను పొందుతారు. అయితే కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి
కుంభరాశికి చెందిన 12వ ఇంటికి శని దేవుడు అధిపతి. మీనరాశిలో శనిసంచార సమయంలో కుంభరాశిలో రెండవ ఇంట్లో సంచరిస్తాడు. కుంభ రాశి వారికి ఇది శని యొక్క సడే సతి యొక్క చివరి దశ. ఈ క్రమంలో వీరు శారీరకంగా, మానసికంగా ఉన్న సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు.
ఆర్థికంగా అపారమైన ప్రయోజనాలను పొందుతారు. కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి వారి కోరికలు తీరుతాయి. విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో కుంభ రాశి వారు భారీ ఆర్థిక లాభాలను పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications