2025లో ఈ రాశులవారికి అఖండ రాజయోగాన్ని ప్రకటించిన శని!
న్యాయదేవుడు, క్రమశిక్షణ నేర్పే దేవుడైన శని దేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 2025 మార్చి నెల వరకు కుంభరాశిలోనే శని సంచారం జరుగుతుంది. ఆ తర్వాత శని దేవుడు మీనరాశిలోకి అడుగుపెడతాడు. మీనరాశిలో శని సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని కలిగిస్తుంది. 2025సంవత్సరం మార్చి నెలలో మీన రాశిలో శని సంచారం కారణంగా అదృష్టాన్ని పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
మీన రాశిలో శని సంచారం కారణంగా మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభపడతారు. మీనరాశి వారి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది.

వృషభరాశి
మీన రాశిలో శని సంచారం కారణంగా వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. శని దేవుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. పెళ్ళికాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఈ సమయం నిజంగా మంచి సమయం.
కర్కాటక రాశి
మీన రాశిలో శని సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. కర్కాటక రాశి జాతకులు చిరకాల స్వప్నం నెరవేరడానికి ఇదే సమయం.
సింహరాశి
మీనరాశిలో శని సంచారం కారణంగా సింహరాశి వారికి కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో జాక్ పాట్ లను కొడతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది.సింహరాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.
కుంభరాశి
మీనరాశిలో శని సంచారం కుంభరాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారి ఆదాయం వనరులు గణనీయంగా పెరుగుతాయి. కుంభరాశి జాతకులు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications