2025లో హనుమాన్ దయతో నక్కతోక తొక్కే రాశులివే!
సనాతన ధర్మంలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. హిందువులు చాలా మంది దేవుళ్లను విశ్వసిస్తారు. ఒకరు రాముడిని, మరొకరు కృష్ణుడిని, ఇంకొకరు శివుడిని ఇలా అందరూ ఎవరికి వారు తమకు నచ్చిన దేవుడిని పూజిస్తారు. అలా హిందువులు ఎక్కువగా విశ్వసించే భగవంతుడి ప్రతిరూపాలలో హనుమంతుడు ఒకడు.
హనుమాన్ ఆశీర్వాదం ఉండే రాశులు
హనుమంతుడు జీవితంలో వచ్చిన కష్టాలను తొలగించి ధైర్య సాహసాలతో ముందుకు నడిచేలా శక్తినిస్తాడు. ఎవరైతే భక్తిశ్రద్ధలతో హనుమంతుని పూజిస్తారో వారికి హనుమాన్ ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తాడు. హనుమంతుడిని పూజిస్తే శని దోషాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. 2025 సంవత్సరంలో హనుమంతుడి ప్రత్యేక ఆశీర్వాదంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
2025 సంవత్సరంలో మేష రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. హనుమంతుని దయతో 2025 సంవత్సరంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఏ పని చేసినా ఇప్పుడు విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. అప్పుల బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతికి కూడా ఛాన్స్ ఉంది.
వృశ్చిక రాశి
2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి హనుమంతుడి దయ వల్ల కలిసొస్తుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. ఆంజనేయుడి కృపతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి చేసే పనులలో సానుకూల ఫలితాలు సాధిస్తారు.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు అందుతాయి. 2025 సంవత్సరం వృశ్చిక రాశి వారికి అన్ని విధాల శుభ సంవత్సరం.
మకర రాశి
2025లో హనుమాన్ దయతో మకర రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. కొత్త సంవత్సరంలో మకర రాశి వారి జీవితంలోని ప్రతి సంక్షోభం తొలగిపోతుంది. చాలా కాలంగా పరిష్కరించబడని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తులకు సంబంధించిన వివాదాలు పూర్తయి లాభం కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మెరుగుదల ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications