త్వరలో మేషరాశిలో సూర్యసంచారంతో నెలరోజులు నక్కతోక తొక్కే రాశులివే!
వేద జ్యోతిష శాస్త్రంలో సూర్యగ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నవగ్రహాలకు అధిపతిగా సూర్యుడిని చెబుతారు. గ్రహాల రాజు అయిన సూర్యుడు నాయకత్వాన్ని, అధికారాన్ని, శక్తిని సృజనాత్మకతను ఇచ్చే దేవుడు. సూర్యుడు ఒక నెల రోజుల పాటు ఒకే రాశిలో సంచారం చేస్తాడు. ఏప్రిల్ 14 2025న తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాలకు మేషరాశిలో సూర్య సంచారం ప్రారంభమవుతుంది.
మేషరాశిలో సూర్య సంచారం
మేషరాశిలో సూర్యుడు సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. మేషరాశిలో సూర్య సంచారం ఉచ్చ స్థితిలో సాగుతుంది. ఈ రాశిలో సూర్యుడు సంచారం చేసినప్పుడు సూర్యుడు శక్తి మరింత బలోపేతం అవుతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి నెలరోజుల పాటు అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
మేషరాశిలో సూర్యసంచారం మేషరాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో మంచి శక్తిని పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మేష రాశి వారికి ఇది మంచి సమయం. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నత ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
సింహరాశి
మేషరాశిలో సూర్యసంచారం సింహరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. సింహ రాశి వారికి సూర్యుడు అధిపతి, కాబట్టి అది సింహరాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. సింహరాశి వారు ఏదైనా మతపరమైన మరియు శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమయంలో కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. సింహరాశి వారి కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఆ ప్రయత్నాలలో విజయాలను సాధిస్తారు.
ధనస్సు రాశి
మేషరాశిలో సూర్య సంచారం ధనుస్సురాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయం ధనుస్సురాశి వారికి కొత్త అవకాశాలు విజయాలు వరిస్తాయి. వ్యాపారం చేసే వారికి విదేశాల నుండి మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధ్యమవుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది. మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రతిభకు ఈ సమయంలో గుర్తింపు లభిస్తుంది. ఇది ధనుస్సురాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications