అక్టోబర్ లో రుచక రాజయోగంతో వీరు నక్కతోక తొక్కుతారు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు కాలానుగుణంగా తమ స్థానాలను మార్చుకుంటూ వివిధ రాశుల వారికి శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి. గ్రహాలలో కీలక గ్రహంగా చెప్పబడే కుజుడు సొంత రాశి అయిన వృశ్చికం లోకి ప్రవేశిస్తున్నాడు. దీని ఫలితంగా రుచక రాజయోగం ఏర్పడుతుంది. దీనిని మహాపురుష రాజయోగం గా కూడా చెబుతారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాజయోగాన్ని అత్యంత శుభప్రదమైన యోగంగా చెబుతారు.
రుచక రాజయోగం.. అదృష్ట రాశులు
ఈ రుచక రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలలో అందమైన రోజులు రాబోతున్నాయి. వీరు అపారమైన సంపదలను, విజయాలను ఈ రాజయోగం కారణంగా పొందుతారు. ఈ సమయం వీరికి విజయాలను ఇస్తుంది. రుచక రాకయోగం కారణంగా లబ్ది పొందే ఆ అదృష్ట రాశుల జాబితానికి తెలుసుకుందాం.

సింహరాశి
అక్టోబర్ మాసంలో రుచక రాజయోగం కారణంగా సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది. కుజుడు సింహరాశిలో నాలుగవ ఇంట్లో సంచరించడం వల్ల మీరు విజయాలను, ధన లాభాలను పొందుతారు. ఈ సమయంలో వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు కార్యాలయాలలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. అత్తమామలతోను, తల్లి తోను సంబంధం బలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటక రాశి
రుచక రాజయోగం కారణంగా కర్కాటకరాశి వారికి వ్యక్తిగతమైన వృత్తిపరమైన జీవితంలో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. కుజుడు కర్కాటక రాశిలో కర్మ స్థానానికి వెళ్లడం వలన మీకు కెరీర్లో విజయవాడ లభిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చేసుకున్న వివిధ ఒప్పందాలు లాభాలను ఇస్తాయి. కొత్త ఉద్యోగం చేయాలనుకుని చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. కర్కాటకరాశి జాతకులు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
వృశ్చిక రాశి
రుచక రాజయోగం కారణంగా అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ రాజయోగం మీ రాశిలోని లగ్న గృహంలో ఏర్పడడం వల్ల వృశ్చిక రాశి వారి ఆత్మవిశ్వాసం అపారంగా పెరుగుతుంది. వీరు కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. ఉన్నతాధికారుల నుండి గౌరవాన్ని పొందుతారు. వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారస్తులు తెలివైన నిర్ణయాలను నుండి భారీగా ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications