మూడురోజుల్లో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టబోతున్న రాశులివే!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది. కర్కాటక రాశిలో ఆగస్టు 11వ తేదీన బుధుడు ప్రత్యక్ష సంచారం చేస్తాడు. కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశిలో బుధుడి ప్రత్యక్ష సంచారం
ఆగస్టు 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాలకు కర్కాటక రాశిలో బుధుడు ప్రత్యక్షమవుతాడు. కర్కాటక రాశిలో బుధుడు ప్రత్యక్షం కారణంగా కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. బుధ ప్రత్యక్ష సంచారంతో లబ్ధి పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి
కర్కాటక రాశిలో బుధుడి ప్రత్యక్షసంచారం కారణంగా మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది. బుధుడు మేషరాశిలో మూడవ మరియు 6వ ఇళ్లను పాలిస్తాడు. నాల్గవ ఇంటి గుండా బుధుడు సంచారం చేయడం వల్ల మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆస్తుల కొనుగోలులో ప్రయోజనాలు చూస్తారు. కుటుంబ సభ్యులతో జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక భద్రత కలుగుతుంది. శక్తివంతమైన వ్యక్తులతో పరిచయం ప్రయోజనాలను ఇస్తుంది.
మిధున రాశి
మిధున రాశి వారికి బుధుడి ప్రత్యక్ష సంచారం మంచి ప్రయోజనాలను ఇస్తుంది. బుధుడు మిధున రాశిలో లగ్న గృహానికి మరియు నాలుగవ ఇంటికి అధిపతి. బుధుడు మిధున రాశిలో రెండవ ఇంట్లో ప్రత్యక్ష గమనంలో ఉండడం వల్ల ఈ సమయంలో ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలోనూ మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి.
కన్యారాశి
కన్యా రాశి వారికి బుధుడి ప్రత్యక్ష సంచారం శుభాలను చేకూరుస్తుంది. కన్యారాశి వారి పదవ ఇంటికి, లగ్న గృహానికి అధిపతి అయిన బుధుడు 11వ ఇంట్లో అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. బుధ గ్రహం ప్రత్యక్ష సంచారం కారణంగా కన్యా రాశి వారి కెరీర్ మెరుగుదలకు దోహదం చేస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి.
తులారాశి
బుధుడు ప్రత్యక్ష సంచారం తులా రాశి జాతకులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. తులారాశిలో బుధుడు 12వ మరియు 9వ ఇంటికి అధిపతిగా ఉంటాడు. ప్రస్తుతం బుధుడు పదవ ఇంట్లో ప్రత్యక్ష సంచారం చేయబోతున్నాడు. దీని ఫలితంగా తులా రాశి జాతకులకు వర్తక వ్యాపారాలలో కలిసి వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కెరీర్ లో పదోన్నతులు కలుగుతాయి. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications