వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Must Read:పెంపుడు జంతువుల పెంపకం – వాస్తుకు సంబంధమేంటి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

వాస్తు ప్రకారం ఇంట్లో పెంపుడు జంతువులను పెంచడం మంచిదా కాదా అనే అనుమానం చాలా మందికి కల్గుతుంది. ఇంటిలో పెంపుడు జంతువుల్ని పెంచడం ఖచ్చితంగా హితకరమేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే అవి (వాస్తుదోషాలు) పరోక్షముగా ఇంట్లో పెంచే పెంపుడు జంతువుల మీద తమ దుష్ప్రభావాన్ని చూపిన తర్వాతే గృహస్తులను బాధిస్తాయి. జంతువుల పెంపకం కోసం మీ ఇంట్లో షెడ్డును నిర్మించాలనుకుంటే దక్షిణ - మధ్యస్థ భాగం, నైరుతి లేదా వాయువ్యం వైపో లేదా పడమర - మధ్యస్థ భాగములోనో నిర్మించడం మంచిది.

అలాగే వాస్తు దోష నివృత్తికి తాత్కాలిక పరిహారం కోసం అద్దె ఇంటిలో ఉన్నవారు, వాస్తు శాస్త్రానికి అనుగుణంగా తమ ఇంటిని పునర్మించడానికి ఆర్థికస్తోమతలేనివారు దోష నివృత్తి కోసం ప్రతిరోజూ దేవాలయానికి వెళ్ళి అక్కడ కొంత సమయాన్ని వెచ్చించిన తర్వాత తమ పనిని ప్రారంభిస్తే సత్ఫలితాలనిస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. సుఖశాంతులనొసగే ఇంటిలో చోటుచేసుకున్న మంచి, చెడులు ఆ ఇల్లు పొడవు, వెడల్పులపై ఆధారపడి ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Is it good to raise Pets at home, what does Vaastu speak about pets, know here

* 42 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పుతో ఇల్లు కట్టినట్లైతే ఆ ఇల్లు ఉత్సాహవంతమైన జీవితాన్ని అందిస్తుంది. ఎల్లవేళలా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసేందుకు దోహదపడుతుంది. ఇల్లంతా పిల్లాపాపలతో చిరకాలం కళకళలాడుతుంది.

* 43 అడుగుల పొడవు, 43 అడుగుల వెడల్పుతో ఇల్లు కట్టుకున్నట్లైతే ఆ ఇంటిలో నివసించేవారు ఎల్లవేళలా కష్టాలు, కడగండ్లతో జీవితాన్ని సాగించాల్సి ఉంటుంది.

* 44 అడుగుల పొడవు, 44 అడుగుల వెడల్పుతో ఇంటిని నిర్మించినట్లైతే ఆస్తి నష్టం కలగడమే కాకుండా ఆ ఇంటికి కష్టాలు వెన్నంటే ఉంటాయని వాస్తు శాస్త్ర గ్రంధాలు తెలుపుతున్నాయి.

* ఆగ్నేయంలో ఖాళీ ఉండరాదు... ఆగ్నేయ దిశలో స్థలం తగ్గి ఉంటే సమస్త సంపదలు చేకూరుతాయి.

* మీ గృహంలో ఆగ్నేయ దిశ స్థలం ఎక్కువ ఖాళీగా ఉంటే మాత్రం సమస్త సంపదలు హరింపబడుతాయి. ఇంకా అప్పుల బాధ, ఈతిబాధలు, నమ్మినవారి చేతిలో మోస పోవడం వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి.

* తూర్పుతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించే వారికి సంతాన ప్రాప్తి ఉండకుండా చేస్తుంది.

* దక్షిణంతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించేవారికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. కోర్టు సమస్యలు, అనేక వ్యాధులు, ఆపదలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* పడకగదిలో ఆగ్నేయం వైపు బెడ్‌ ఉంటే కుటంబ సభ్యులు మానసిక ఆందోళనకు గురవుతారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

English summary
Many people have doubts as to whether it is better to keep pets at home according to the architecture. Raising pets at home is definitely a good idea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X