బుధుడి ఉదయంతో ఈ రాశులవారికి నేటినుండి జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జాతకాలను మారుస్తాయనే విషయం తెలిసిందే. అయితే గ్రహాల రాకుమారుడు గా పరిగణించే బుధుడికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు అక్టోబర్ 22వ తేదీన తులారాశిలో ఉదయించబోతున్నాడు అంటే నేడు బుధుడి ఉదయం జరుగుతుంది.
బుధుడి ఉదయం
బుధోదయం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. బుధుడు కమ్యూనికేషన్ కు, తెలివితేటలకు ప్రతీకగా భావిస్తారు. వృత్తి నైపుణ్యాలకు కూడా ఆయనను ప్రతీకగా చెబుతారు. తులా రాశిలో ఇంతకాలం అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు నేడు ఉదయిస్తున్నాడు. ఇక ఈ మార్పు కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. నేటి నుంచి బుధోదయం కారణంగా లబ్ధి పొందుతున్న ఆ రాశులను తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారి ఐదవ ఇంట్లో బుధుడి ఉదయం జరుగుతుంది. ఈ క్రమంలో మిధున రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఉద్యోగంలో వీరు పురోగతిని సాధించే అవకాశం ఉంది. వృత్తిపరంగా అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు సాగుతారు. ఈ సమయంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. మిధున రాశి వారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో పోటీని కూడా సమర్ధంగా ఎదుర్కొని ప్రత్యర్థులకు షాకిస్తారు.
సింహరాశి
సింహరాశిలో మూడవ ఇంట్లో బుధుడి ఉదయం జరుగుతుంది. దీని కారణంగా సింహ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. వర్తక వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. డబ్బు ఆదా చేస్తారు. పనిచేసే చోట కొత్త మార్పులతో అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో కొత్త ఆఫర్లను అందుకుని ముందుకు సాగుతారు.
కన్య రాశి
కన్య రాశిలో రెండవ ఇంట్లో బుధుడి ఉదయం జరుగుతుంది. దీని కారణంగా కన్యారాశి జాతకులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఇప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఇది కన్యా రాశి వారికి అదృష్ట సమయం.
తులా రాశి
తులారాశిలో బుధుడు ఉదయం జరుగుతుంది. బుధుడు ఉదయించటం తులా రాశి వారికి శుభాలను ఇస్తుంది. ఈ సమయంలో తులా రాశి వారికి ఏ పని చేసినా కలిసొస్తుంది. ఇది ఆర్థికంగా తులా రాశి వారికి ప్రయోజనాలను చేకూర్చే కాలం. ఈ సమయంలో తులా రాశి జాతకుల కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. ఈ సమయంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
మకర రాశి
మకర రాశిలో పదవ ఇంట్లో బుధుడి ఉదయం జరుగుతుంది. దీంతో మకర రాశి వారికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళతారు. వర్తక వ్యాపారాలలో పోటీదారుల మీద పై చేయి సాధిస్తారు. ఈ సమయంలో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటారు.
కుంభరాశి
కుంభ రాశిలో బుధుడి ఉదయం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారికి ఆధ్యాత్మికంగా ఆసక్తి పెరుగుతుంది. కుంభరాశి జాతకులకు వారసత్వ ఆస్తి కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఏ పని చేసిన సత్ఫలితాలను పొందుతారు. సంపద గణనీయంగా వృద్ధి చెందుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications