జులై 17 సోమవతీ అమావాస్య.. ఈ 5 పనులు పొరబాటున కూడా చెయ్యొద్దు; డేంజర్!!
జులై 17వ తేదీ. జులై 17వ తేదీన వచ్చే అమావాస్యను హరియాళీ అమావాస్య అంటారు. ఇది సోమవారంనాడు వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్యగా చెబుతారు. ఇక అమావాస్య తిథి అంటే సూర్య చంద్రుల కలయిక కాలంగా చెబుతారు. అమావాస్య తిది నాడు చాలా పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తారు .
ముఖ్యంగా నేడు సోమవారం నాడు వచ్చే సోమవతి అమావాస్య కాబట్టి ఈ రోజు పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అమావాస్య రోజున ప్రతికూల శక్తులు చురుగ్గా ఉంటాయని చెబుతారు. ఈ ప్రతికూల శక్తులు వ్యక్తులకు హాని కలిగించవచ్చు. కాబట్టి ఈరోజు స్మశాన వాటిక చుట్టూ పొరపాటున కూడా తిరగకండి.

ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రదేశాలను నివారించడం మంచిది. సోమవతి అమావాస్య రోజున మాంసం, చేపలు, మద్యం మొదలైన వాటి వినియోగాన్ని నిషేధించడం మంచిది. సోమవతి అమావాస్య సమయంలో ఇంట్లో పొరపాటున కూడా కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోకండి. ఒకవేళ అలా గొడవ పెట్టుకుంటే అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది.
సోమవతి అమావాస్య నాడు కుటుంబంలో ఉన్న శాంతిని కాపాడుకోండి. ఇంటా బయట ఎటువంటి గొడవలలోనూ, వివాదాలలోనూ జోక్యం చేసుకోకండి. అమావాస్య తిధి పూర్వీకుల కోసం అంకితం చేయబడినది కాబట్టి సోమవతి అమావాస్య నాడు పూర్వీకుల జ్ఞాపకార్థం మతపరమైన కార్యకలాపాలను నిర్వహించండి. దానధర్మాలను చేయండి. అప్పుడు పూర్వీకులు తృప్తి చెందుతారు.
సోమవతి అమావాస్య రోజు పొరపాటున కూడా షాపింగ్ లు, కొత్త పనులు చేయకండి. కొత్త వస్త్రాలు, వస్తువులను కొనుగోలు చెయ్యకండి. ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. సోమవతి అమావాస్యనాడు పొరపాటున కూడా నిస్సహాయులకు ఇబ్బంది కలిగించకండి. ఇది భగవంతుని ఆగ్రహానికి కారణంగా మారుతుంది.ఈ పనుల విషయంలో జాగ్రత్తగా ఉండటంతో పాటు శివుని, పూర్వీకులను పూజించి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటే అన్ని విధాలా మేలు జరుగుతుందని చెప్పొచ్చు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications