రాసి పెట్టుకోండి.. 2025లో వీరే కుబేరులు.. ప్రకటించిన దేవగురువు!
2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల గమనం, ముఖ్య గ్రహాల తిరోగమన సంచారం అనేక రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఫిబ్రవరి నెలలో దేవ గురువైన బృహస్పతి తిరోగమన స్థితిలో సంచారం చేస్తాడు. బృహస్పతిని తొమ్మిది గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగాను శుభాలను చేకూర్చే గ్రహంగాను భావిస్తారు. బృహస్పతి కారణంగా సంపద, సౌభాగ్యం, సంతాన ప్రాప్తి కలుగుతాయి.
బృహస్పతి తిరోగమన సంచారం
బృహస్పతి 12నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు .అటువంటి బృహస్పతి మే ఒకటవ తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ సంవత్సరం అక్టోబర్ 9న బృహస్పతి తిరోగమన స్థితిలోకి వెళ్ళాడు. 2025 ఫిబ్రవరిలో కూడా బృహస్పతి తిరోగమన స్థితిలోనే సంచారం సాగిస్తాడు. దీని ప్రభావం కొన్ని రాశులవారి పైన కచ్చితంగా పడుతుంది. కొన్ని రాశులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశిలో మొదటి ఇంట్లో బృహస్పతి తిరోగమన స్థితిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. దీనివల్ల వృషభ రాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. పై అధికారుల నుండి సానుకూల స్పందన వస్తుంది. సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. వృషభ రాశి వారికి ఇది మంచి సమయం.
సింహరాశి
సింహరాశిలో 11వ ఇంట్లో బృహస్పతి తిరోగమన స్థితిలో సంచారం చేస్తాడు. దీని ప్రభావం వల్ల సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి పురోగతి ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. నూతన వ్యాపారాలు మీకు మంచి పురోగతిని కలిగిస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బృహస్పతి తిరోగమన సంచారం శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు మంచి ఆర్థిక పురోగతిని సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఆర్థికంగా వీరు లాభ పడే అవకాశం ఉంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు డబ్బులను ఆదా చేస్తారు.ఇది వీరికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications