Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నవంబర్ వరకు మూడునెలలు వీరికి సంపదలను ప్రకటించిన బృహస్పతి!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశులవారి జాతకాలు ప్రభావితం అవుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. దేవగరువుగా పిలిచే బృహస్పతి ఈ సంవత్సరం మొత్తం వృషభ రాశి లోనే సంచరిస్తున్నాడు. అయితే బృహస్పతి నక్షత్రాన్ని మారుస్తూ ప్రయాణం చేస్తున్నాడు. ఆగస్టు 20వ తేదీన బృహస్పతి రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయనున్నారు.

మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి
ఆగస్టు 20 నుండి నవంబర్ 28 2024 వరకు బృహస్పతి మృగశిర నక్షత్రంలోనే కొనసాగుతాడు. దీనివల్ల కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. వీరికి మూడు నెలల పాటు ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. బృహస్పతి సంచారం ఏ రాశి వారికి శుభాలను చేకూరుస్తుందో, ఎవరికి బృహస్పతి కటాక్షం సిరులను కురిపిస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Jupiter announced wealth for these zodiac signs for three months till November 28th

మేష రాశి
బృహస్పతి నక్షత్ర సంచారం మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆర్ధికంగా ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాలలో లాభం వస్తుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మేష రాశి జాతకులకు ఈ సమయం అదృష్ట సమయమని చెప్పొచ్చు.

వృషభరాశి
బృహస్పతి నక్షత్ర సంచారం వృషభ రాశి వారికి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. వృషభరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్లో గొప్ప విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా ఈ సమయంలో వృషభ రాశి వారు బలంగా ఉంటారు. పాత పెట్టబడలు వృషభ రాశి వారికి మంచి లాభాలను ఇస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగివస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లబ్ధిని పొందుతారు.

కన్యారాశి
బృహస్పతి నక్షత్ర సంచారం కన్యా రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో పురోగతి ఉంటుంది. పూర్వీకుల నుండి ఆస్తులు ద్వారా ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలను వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

ధనుస్సు రాశి
బృహస్పతి నక్షత్ర సంచారం ధనుస్సు రాశి వారికి శుభాలకు కారణం అవుతుంది. ధనుస్సు రాశి వారు మూడు నెలలు ఆర్ధిక లబ్ది పొందుతారు. ధనుస్సు రాశి జాతకులు ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఈ సమయంలో ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+