2026లో వీరికి శని వదిలిపోతుంది.. అంతా అనుకున్నట్టే ఉంటుంది!
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. దేవతల గురువు అయిన బృహస్పతి కి కూడా అటువంటి స్థానమే ఉంటుంది. గ్రహాలలో ముఖ్య గ్రహంగా బృహస్పతిని పరిగణిస్తారు. ఇక బృహస్పతి ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మార్చుకుని సంచారం చేస్తాడు. నవంబర్ 11న కర్కాటక రాశిలో తిరోగమన స్థితిలోకి వెళ్లిన బృహస్పతి డిసెంబర్ 5న మిధున రాశిలోకితిరోగమనం లోనే వెళ్ళాడు.
మిధునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం
మార్చి 11 2026 న మిధున రాశిలో ప్రత్యక్షంగా మారతాడు. 2026 సంవత్సరంలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. వారికి విశేష ఫలితాలను ఇస్తుంది. 2026లో వీరికి శని వదిలిపోతుంది.. అంతా అనుకున్నట్టే ఉంటుంది. బృహస్పతి రాశి మార్పు కారణంగా 2026లో శుభ ఫలితాలను పొందే రాశులను తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశిలో బృహస్పతి మూడవ ఇంట్లో ప్రత్యక్ష సంచారం చేస్తాడు. అందువల్ల ఈ రాశి జాతకులకు ఇప్పుడు ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సంపద పెరుగుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మేషరాశి వారి కెరీర్ బాగుంటుంది. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో మేషరాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి.
మిధున రాశి
బృహస్పతి ప్రత్యక్ష సంచారం మిధునరాశి జాతకులకు శుభాలను చేకూరుస్తుంది. మిధునరాశిలో బృహస్పతి నేరుగా లగ్న గృహంలో సంచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వం బలంగా ఉంటుంది . మిధునరాశిలోని ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, నిర్వాహకులు, సలహాదారులుగా పనిచేసేవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. అవివాహితులు వివాహ ప్రతిపాదనలను అందుకుంటారు. మిధునరాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త సంబంధాలు బలోపేతం అవుతాయి.
వృశ్చిక రాశి
బృహస్పతి ప్రత్యక్ష సంచారం వృశ్చికరాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది. ఈ రాశిలో ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి ప్రత్యక్ష సంచారం చేస్తాడు. ఈ రాశిలో జన్మించిన వారు ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. దీర్ఘకాల వివాదాలు తొలగిపోతాయి. అనవసరమైన సమస్యల నుండి బయటపడతారు. ఖర్చులు తగ్గుతాయి. డబ్బు ఆదా చేస్తారు. ఇది వీరికి శుభ సమయం.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications