12ఏళ్ళ తర్వాత వీరికి అఖండ ధనయోగం వరమిచ్చిన కర్కాటక బృహస్పతి!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం గురువు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో గురువుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి గురువు 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అక్టోబర్ నెలలో గురువు మిధున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.
కర్కాటక రాశిలో గురు సంచారం
కర్కాటక రాశిలో గురు సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితాలలో గురువు శుభాలను చేకూర్చబోతున్నాడు. బృహస్పతి కర్కాటక రాశి సంచారం కారణంగా శుభాలను పొందే ఆ రాశులను తెలుసుకుందాం.

తులారాశి
కర్కాటక రాశిలో గురు సంచారంతో తులా రాశి జాతకులకు కలిసి వస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయం నుండి అదృష్ట జాతకులుగా మారుతున్నారు. తులా రాశి వారికి నూతన ఉద్యోగాలు వస్తాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారి వర్తక వ్యాపారాలకు సమయం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి వారు భారీగా లాభాలను పొందుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి గురు సంచారం బాగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో వృత్తి వ్యాపారాలలో విజయాలను సాధిస్తారు. వృశ్చిక రాశి విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఏ పని చేసిన లాభాలు వస్తాయి.
మీనరాశి
మీన రాశి వారికి కర్కాటక రాశిలో గురు సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు పిల్లలకు సంబంధించిన శుభ వార్తలు వింటారు. మీన రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీన రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా సత్ఫలితాలు వస్తాయి. గురు సంచారం మీనరాశి వారికి వర్తక వ్యాపారాలలో లాభాలను చేకూరుస్తుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications