జూన్ లో బృహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జూన్ 2, 2026న బృహస్పతి తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించడం వల్ల వృషభం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, మీన రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
జూన్ నెలలో కర్కాటక రాశిలోకి బృహస్పతి
జూన్ 2, 2026 ఉదయం 6:30 గంటలకు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అక్టోబర్ 31 వరకు గురువు కర్కాటక రాశిలోనే ఉంటారు. ఈ కాలంలో "హంస యోగం" ఏర్పడి, అకస్మాత్తుగా సంపద, ఉన్నత విద్య మరియు ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో అదృష్టం కలిసొచ్చే రాశులను గురించి తెలుసుకుందాం.

కర్కాటకం
గురువు తమ సొంత రాశిలోకి మొదటి గృహంలోకి రావడం వల్ల, వీరికి ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, మరియు వ్యక్తిగత వికాసం పెరుగుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు అన్నింటా విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది.
వృషభం
వీరికి 3వ ఇంట గురువు సంచారం వల్ల ధైర్యం, సాహసం మరియు సోదరుల మద్దతు లభిస్తుంది. వృషభ రాశి జాతకులకు ఈ సమయం సానుకూల ఫలితాలని ఇస్తుంది. ఇది వీరికి ఆర్ధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వాహన, ఆస్థి యోగాలు ఈ సమయంలో కలుగుతాయి.
కన్య
11వ ఇంట గురువు సంచారం వల్ల కన్యా రాశి జాతకుల ఆదాయ వనరులు పెరుగుతాయి . కన్యా రాశి వారికి ఈ సమయంలో కోరికలు నెరవేరుతాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇది కన్యా రాశి జాతకులకు అన్ని విధాలా అనుకూల సమయం. కలిసి వచ్చే కాలం.
వృశ్చికం
9వ ఇంట గురువు సంచారం వల్ల వృశ్చిక రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. వీరికి ఈ సమయంలో భాగ్యం, విదేశీ ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతాయి. వీరు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అన్ని విధాలా ఇది వీరికి శ్రేయస్సును ఇస్తుంది.
మీనం
5వ ఇంట గురువు సంచారం వల్ల సంతాన లాభం, విద్యా విజయం మరియు ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఈ కాలంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఆస్తి కొనుగోలుకు ఇది ఉత్తమ సమయం.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications