2025లో ఏప్రిల్ వరకు వీరే మహర్జాతకులు.. తేల్చేసిన బృహస్పతి!
2025లో ముఖ్య గ్రహాల రవాణా అన్ని రాశులవారి జీవితాలలో ఊహించని మార్పులకు కారణం కానున్నాయి. 2025లో బృహస్పతి రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తుంది. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తుంది. సహజంగా ధనాన్ని, వివాహ వరాన్ని, సంతాన ప్రాప్తిని, సౌభాగ్యాలను కలిగించే బృహస్పతి ప్రస్తుతం రోహిణీ నక్షత్రంలో సంచరిస్తూ 2025 ఏప్రిల్ 10 వ తేదీన మృగశిర నక్షత్రంలోకి సంచారం చేస్తాడు.
రోహిణీ నక్షత్రంలో బృహస్పతి
ప్రస్తుతం బృహస్పతి రోహిణీ నక్షత్రంలో ఉండటం కారణంగా . కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి విశేషమైన ధనయోగం కలుగుతుంది. ఈ సంచారం ఆయా రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలకు కారణం అవుతుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
2025 లో వృషభ రాశి వారికి బృహస్పతి సంచారం శుభదాయకంగా ఉంటుంది. ఏప్రిల్ నెల వరకు వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అవకాశం వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు. ఖర్చులు తగ్గుతాయి. పొదుపు పెరుగుతుంది. . ఇది మేషరాశి జాతకులకు శుభ సమయం.
సింహరాశి
2025లో బృహస్పతి సంచారం కారణంగా సింహ రాశి వారికి కలిసి వస్తుంది. 2025లో బృహస్పతి సింహరాశిలో 11వ ఇంట్లో సంచరించడం వల్ల వీరికి వృత్తిపరమైన లాభాలు వస్తాయి. అధికారుల నుండి మన్ననలు పొందుతారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది. వారసత్వ ఆస్తుల సమస్యలు పోతాయి. చాలా కాలంగా రాకుండా పెండింగ్లో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇది సింహ రాశి వారికి అదృష్ట కాలం.
కర్కాటక రాశి
2025లో బృహస్పతి రోహిణీ నక్షత్రంలో సంచరించడం వల్ల కర్కాటక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశిలో బృహస్పతి 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు అన్ని విధాల లబ్ధిని పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార వృద్ధి కలుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.ఈ సమయంలో కర్కాటక రాశి వారి జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications