వీరి జీవితాలపై విషం చిమ్ముతున్న కాలసర్ప యోగం.. జాగ్రత్త!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలసర్పయోగం ఒక అశుభ యోగం. రాహువు, కేతువు తమ గ్రహాలను, స్థానాలను మార్చుకున్నప్పుడు కాల సర్ప యోగం ఏర్పడుతుంది. మే 18వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కాలసర్పయోగం ప్రభావం ద్వాదశ రాశుల వారి జీవితాల పైన తప్పక ఉంటుంది.

కాల సర్ప యోగం
మే 18వ తేదీన కుంభ రాశిలో రాహువు, సింహరాశిలో కేతువు ప్రవేశించడం వల్ల కాలసర్పయోగం ఏర్పడింది. దీని ప్రభావం జూలై 28వ తేదీ వరకు అన్ని రాశుల వారి పైన ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారు తీవ్రమైన కష్టాలను నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

kalasarpa yoga 2025 these zodiac signs to face difficulties and financial losses

మేషరాశి
కాలసర్పయోగం కారణంగా మేష రాశి జాతకులకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. మేషరాశిలో కేతువు ఐదవ స్థానం నుండి సంచారం చేస్తాడు. ఇది అసలు మంచి ఫలితాలను ఇవ్వదు. వీరి ప్రేమ జీవితంలో ఆందోళనలు కొనసాగుతాయి. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యపరంగానూ ఆందోళనకరంగా ఉంటుంది. ఆసుపత్రులలో చేరవలసి రావచ్చు. కాబట్టి మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి
కాలసర్పయోగం మిధున రాశి జాతకులకు ఇబ్బందులను కలిగిస్తుంది. మిధున రాశి వారు ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. ప్రయాణాలలో విలువైనవి పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ పని చేసిన ఆచితూచి చేయాలి.

సింహరాశి
కాలసర్పయోగం కారణంగా సింహరాశి జాతకులు ప్రతికూల ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో సింహరాశి జాతకులు నష్టపోయే అవకాశం ఉంది. పదునైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గాయాల పాలయ్యే అవకాశం ఉంది. ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇది అస్సలు మంచి సమయం కాదు.

కుంభరాశి
కాల సర్ప యోగం కారణంగా కుంభరాశి జాతకులు అనేక ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థికపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ జీవితంలో విభేదాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి.

మీనరాశి
కాలసర్ప దోషం కారణంగా మీనరాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీనరాశిలో రాహువు 12వ స్థానంలో, కేతువు ఆరవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీరు ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు నష్టాలను కలిగించే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+