కార్తీక పౌర్ణమి.. నేటినుండి వీరి జీవితాల్లో సంతోషాల కాంతులు, సంపదలు!
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం నవంబర్ మాసంలో నేడు వచ్చిన కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనది. కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే దీపదానం చేస్తారో వారి విశేషమైన ఫలితాలను పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజు గ్రహాల సంచారం కారణంగా ఏర్పడే యోగాలు కూడా అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి.
కార్తీక పౌర్ణమి నుండి అదృష్ట రాశులు
ఈసారి కార్తీక పౌర్ణమి నాడు శివవాస యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడనున్నాయి. శుక్రుడి పాలనలోని భరణీ నక్షత్ర ప్రభావం కూడా ద్వాదశ రాశుల పైన ఉంటుంది. ఈ శుభ యోగాల కారణంగా నేటి నుండి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
కార్తీక పౌర్ణమి నుండి వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విద్యార్థులకు ఈ సమయం మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఏ పని చేపట్టిన విజయాలు చేకూరుతాయి. పెళ్ళికాని వారికి మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం దక్కుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.
మిధున రాశి
కార్తీక పౌర్ణమి మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి విజయం లభిస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మిధున రాశి వారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలకు అవకాశం ఉంది. ఇది మిధున రాశి వారికి అన్ని విధాల శుభాలను చేకూర్చే సమయం.
కన్యారాశి
కార్తీక పౌర్ణమి కన్యారాశి జాతకులకు ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. కన్యారాశి జాతకుల ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మతపరమైన కార్యకలాపాలను నిర్వహిస్తారు. పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అనుకూల సమయం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
తులారాశి
కార్తీక పౌర్ణమి నుంచి తులా రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఏం చేసినా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications