ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే ఎలాంటి వాస్తుదోషమైనా పరార్!
ఇంటికి ఏ విధంగా అయితే వాస్తు ఉండాలో, అదేవిధంగా ఇంట్లో ఉన్న వాళ్ళు సుఖసంతోషాలతో జీవించాలంటే కూడా వాస్తు అవసరమే. వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్త మాత్రమే కాదు, ప్రతి గదిలోను పెట్టుకోవలసిన వస్తువుల విషయంలో కూడా పెట్టవలసిన శ్రద్ధ. అయితే ప్రతి ఇంట్లోనూ మనకు తెలియకుండానే అనేక తప్పిదాలు చేస్తూ ఉంటాం. వాటి వల్ల వచ్చే వాస్తు దోషాల ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం.
ఈ ఒక్క పదార్ధంతో వాస్తుదోషం నుండి విముక్తి
ఇంట్లో వాస్తుదోషం ఉంటే ఆ కుటుంబంపైన తీవ్ర ప్రభావం పడుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. వాస్తు దోషం వల్ల వచ్చే ప్రతికూల శక్తులు వ్యక్తుల జీవితాలపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయని చెబుతారు. అలా వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తులను దూరం చేసి వాస్తు దోషాలను తొలగించడంలో కీలకంగా పనిచేసేది కర్పూరం. మన ఇంట్లో కర్పూరంతో కొన్ని నివారణలు పాటిస్తే కచ్చితంగా వాస్తు దోషం నుండి విముక్తి కలుగుతుంది.

కర్పూరంతో ఇలా చెయ్యండి చాలు
ఇంట్లో కర్పూరం ఒకటి ఉంటే చాలు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక కర్పూరంతో వాస్తు దోష నివారణ ఏ విధంగా చేసుకోవచ్చో ప్రస్తుతం తెలుసుకుందాం. ఇంట్లో వాస్తు దోషాలను తొలగించుకోవడానికి అన్ని గదుల మూలల్లో కర్పూరాన్ని పెట్టాలి. గదుల మూలలో పెట్టిన కర్పూరం అయిపోతే ఆ స్థానంలో మరో కర్పూరాన్ని పెట్టాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించాలి.
కర్పూరంతో పాటు లవంగాలు కాలిస్తే వాస్తు దోష నివారణ
రాత్రివేళ వంటగదిలో పని పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో కర్పూరాన్ని లవంగాలను వేసి కాల్చాలి. ఇలా చేస్తే వాస్తు దోష నివారణ జరుగుతుంది. ప్రతిరోజు ఆగ్నేయ దిశలో కర్పూరాన్ని వెలిగించడం సిరిసంపదలను ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంటి మూలల్లో కర్పూరాన్ని కాల్చడం వల్ల కూడా ఇంట్లో సానుకూలశక్తి వ్యాపిస్తుంది. కర్పూరంతో పాటు లవంగాలను కూడా కాల్చి ఇల్లంతా ధూపం వేస్తే ఇంట్లో ఉండే అన్ని చిరాకులు తొలగిపోతాయి.
స్నానం చేసేటప్పుడు ఇలా చేస్తే మంచిది
స్నానం చేసే నీళ్ళల్లో కూడా కొన్ని చుక్కలు కర్పూరపు నూనె వేసుకుంటే అది శరీరాన్ని ఆరోగ్యంగాను, ఉత్తేజంగాను ఉంచుతుంది. కర్పూరానికి ప్రతికూల శక్తులను దూరం చేసే శక్తి ఉండటం వల్ల కర్పూరంతో ఈ వాస్తు పరిహారాలు పాటిస్తే మంచిది. ఎన్ని వాస్తు దోషాలు ఉన్నా ఒక్క కర్పూరంతో పరిహారాలు పాటిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. సంతోషం వెల్లివిరుస్తుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
YS Jagan: బెంగళూరు నుంచి మకాం మార్చబోతున్న జగన్ ? కూటమికి కౌంటర్ ప్లాన్..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!











Click it and Unblock the Notifications