డిసెంబర్ 9 నుండి వీరికి జాక్ పాట్.. మట్టి పట్టుకున్నా బంగారమే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజ ,శని గ్రహాలకు చాలా విశేషమైన స్థానం ఉంటుంది. డిసెంబర్ మాసంలో ఈ రెండు గ్రహాలు కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరచబోతున్నాయి. కుజుడిని ధైర్యం, శౌర్యం, శక్తి వంటి వాటికి కారకుడిగా చెబుతారు. శనిని కర్మ, న్యాయం, క్రమశిక్షణ వంటి వాటికి కారకుడిగా పరిగణిస్తారు.
కేంద్ర దృష్టి యోగం
అటువంటి ఈ రెండు గ్రహాలు డిసెంబర్ 9వ తేదీన ఉదయం ఐదు గంటల 42 నిమిషాలకు ఒకదానికొకటి 90 డిగ్రీల వద్ద ఉండి కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు వస్తాయి. వారు ఈ సమయంలో అన్ని విధాల లబ్ధిని పొందుతారు. కుజ శని గ్రహాలతో ఏర్పడే కేంద్ర దృష్టి యోగం కారణంగా లబ్ది పొందే రాశులను గురించి తెలుసుకుందాం.

మిధున రాశి
శని కుజుల కేంద్ర దృష్టి యోగం కారణంగా మిధునరాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలు వస్తాయి. ఈ రాశిలో శని పదవ ఇంట్లో. కుజుడు ఏడవ ఇంట్లో ఉంటారు. అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. కెరీర్లో పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది .జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడపడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
శని కుజుల కేంద్ర దృష్టి యోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. మీరు చేసే పని ప్రశంసించబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శనిదేవుడు ఆశీస్సులతో మీరు పొదుపు చేసే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది.
మీన రాశి
కుజుడు శని కారణంగా ఏర్పడే కేంద్ర దృష్టి యోగంతో మీనరాశి జాతకులకు అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీన రాశి వారు అనేక రంగాలలో విజయాలను చూస్తారు. కెరీర్లో ప్రయోజనాలు ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో ఏ పని చేసిన విజయం సాధిస్తారు.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications