గురు సూర్యులతో కేంద్రయోగం... ఈరాశులవారికి మార్చిలో కుబేరయోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక అత్యంత ముఖ్యమైనదిగా చెబుతారు. ఇక మార్చి నెలలో గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి, మార్చి రెండవ తేదీన సూర్యుడు మరియు బృహస్పతి గ్రహాలు ఒకదానికొకటి 90 డిగ్రీల వద్ద పరివర్తనం చెందుతున్నాయి. ఇది శుభయోగాన్ని సృష్టిస్తుంది

కేంద్ర యోగం
ఈ కేంద్ర యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి కేంద్ర యోగం అద్భుత ఫలితాలను ఇవ్వబోతుంది. సూర్యుడు మరియు బృహస్పతి సంయోగం కారణంగా ఏర్పడే కేంద్ర యోగంతో లబ్ధిని పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

Kendra Yoga with Jupiter and Sun Kubera Yoga for these zodiac signs in march

వృషభ రాశి
వృషభ రాశి వారికి కేంద్ర యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి అసంపూర్ణమైన పనులు పూర్తవుతాయి. వృషభ రాశి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కెరీర్లో కొత్త బాధ్యతలు వస్తాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగం మారాలనుకుంటే ఆ ప్రయత్నం చేయవచ్చు.

మిధున రాశి
మిధున రాశి వారికి సూర్యుడు, బృహస్పతి కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయం మిధున రాశి వారికి కెరీర్ పరంగా చాలా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి సమయం. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వ్యాపారవేత్తలకు ఆర్థిక లాభాలు ఉంటాయి.

కన్యారాశి
కన్యా రాశి వారికి సూర్యుడు బృహస్పతి కలయిక వల్ల ఏర్పడే కేంద్ర యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా రాణిస్తారు. కెరీర్లో మంచి ప్రయోజనాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కేంద్ర యోగం కారణంగా కన్యారాశి వారికి అన్ని విధాలా లబ్ధి జరుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+