ఆరు రోజుల్లో కేతువుతో వీరికి ఊహించని అదృష్టం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతు గ్రహానికి చెడు చేసే గ్రహం గాను, పాప గ్రహం గాను పేరు ఉంది. 2026 సంవత్సరంలో కేతువు నక్షత్ర పరివర్తనం చేస్తుంది. ఇది జనవరి నెలలో జరిగే ముఖ్యమైన గ్రహ పరిణామంగా చెబుతారు. నీడ గ్రహమైన కేతువు నక్షత్ర సంచారం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.
ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి కేతువు
జనవరి 12వ తేదీన కేతువు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. వారు విశేషమైన ఫలితాలను పొందుతారు. కేతువు నక్షత్ర సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభరాశి
వృషభ రాశి వారికి ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఆదాయ వృద్ధి జరుగుతుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాలలో లాభాలను పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. జీవితంలో వృషభ రాశి వారికి మంచి పురోగతి కనిపిస్తుంది.
సింహరాశి
సింహరాశి జాతకులకు కేతువు నక్షత్ర సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది .సింహరాశి జాతకులు కేతువు నక్షత్ర సంచారంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. వివిధ పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తులలో పెట్టుబడులు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు అన్ని విధాల శుభ ఫలితాలను చూస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కీలక నిర్ణయాలు అనుకూలంగా మారి, వ్యాపార మరియు వృత్తి జీవితంలో పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక సాధనను చేసే వీలుంది. ఏ పని చేసిన మీకు సానుకూలతలే కనిపిస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. కేతువు మీకు ఈ సమయంలో లబ్ధిని చేకూరుస్తాడు.
కేతువు ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోండి ఇలా
అయితే కేతు ప్రభావం వల్ల కొంతమందికి అయోమయం, అనూహ్య మార్పులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆలోచించి ముందుకు సాగాలని సూచించబడింది. ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, దాన ధర్మాలు చేయడం కేతువు యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంలో దోహదం చేస్తుంది.మొత్తంగా చూస్తే, 2026లో కేతు నక్షత్ర గోచారం ఆర్థిక పురోగతికి మరియు ఆధ్యాత్మిక చింతనకు దారి తీసే ముఖ్యమైన కాలంగా చెప్పవచ్చు.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications